క్రీడాకారులపై లైంగిక వేధింపులు: కేంద్రంపై కాంగ్రెస్ ఫైర్.. మోడీజీ స‌మాధానం చెప్పండి: జైరాం ర‌మేష్

Published : Jan 19, 2023, 03:57 PM IST
క్రీడాకారులపై లైంగిక వేధింపులు: కేంద్రంపై కాంగ్రెస్ ఫైర్.. మోడీజీ స‌మాధానం చెప్పండి:  జైరాం ర‌మేష్

సారాంశం

New Delhi: భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ స‌హా అనేక మంది కోచ్ లు లైంగికంగా వేధింపుల‌కు పాల్ప‌డుతున్నార‌ని మ‌హిళా రెజ్ల‌ర్లు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. అలాగే, స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగ‌ట్ ఆధ్వర్యంలో బుధ‌వారం ఢిల్లీలోని జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద భారీ నిర‌స‌న ప్రద‌ర్శనకు సైతం దిగారు. ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ కాంగ్రెస్.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, బీజేపీపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించింది.   

Congress general secretary Jairam Ramesh: బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై ప్రధాని నరేంద్ర మోడీ మౌనం వీడాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు సింగ్ ఏళ్ల తరబడి మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నారని స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్ బుధవారం ఆరోపించిన నేపథ్యంలో ప్రతిపక్షాలు ఈ విమ‌ర్శ‌ల‌ దాడి చేశాయి.

వివ‌రాల్లోకెళ్తే.. భార‌త రెజ్లింగ్ స‌మాఖ్య అధ్యక్షుడు, భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ స‌హా అనేక మంది కోచ్ లు లైంగికంగా వేధింపుల‌కు పాల్ప‌డుతున్నార‌ని మ‌హిళా రెజ్ల‌ర్లు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. అలాగే, స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగ‌ట్ ఆధ్వర్యంలో బుధ‌వారం ఢిల్లీలోని జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద భారీ నిర‌స‌న ప్రద‌ర్శనకు సైతం దిగారు. ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ కాంగ్రెస్.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, బీజేపీపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించింది.  భారత రెజ్లింగ్ సమాఖ్యకు, క్రీడాకారులకు మధ్య పోరు పెరుగుతోంది. బుధవారం డబ్ల్యూఎఫ్ఐ, అసోసియేషన్ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కు వ్యతిరేకంగా ఆటగాళ్లు ఆందోళనకు దిగారు.  నేటికీ ఈ నిరసన కొనసాగుతోంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీని కాంగ్రెస్ టార్గెట్ చేసింది. కూతుళ్లను చిత్రహింసలకు గురిచేసిన బీజేపీ నేతల జాబితా అంతులేనిదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ అన్నారు.

ఈ క్ర‌మంలోనే మ‌హిళ‌ల‌పై దాడులు, హింస‌, లైంగిక‌దాడుల ఆరోప‌ణ‌లు ఉన్న ప‌లువురు బీజేపీ నాయ‌క‌కుల పేర్ల‌ను ప్ర‌స్తావిస్తూ జైరాం రమేష్.. మోడీ స‌ర్కారుపై విమ‌ర్శ‌లు గుప్పించారు. "కుల్దీప్ సెంగార్, చిన్మయానంద్, తండ్రీకొడుకులు వినోద్ ఆర్య-పుల్కిత్ ఆర్య... ఇప్పుడు ఇదో కొత్త కేసు!  కూతుళ్లను చిత్రహింసలకు గురిచేసిన బీజేపీ నేతల జాబితా అంతులేనిది. బీజేపీ నేతల నుంచి కూతుళ్లను కాపాడుకునేందుకు 'బేటీ బచావో' హెచ్చరికలా? మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ దీనికి స‌మాధానం చెప్పండి" అని జైరాం ర‌మేష్ ప్ర‌శ్నించారు. 

 

అలాగే, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా సైతం ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఆమె ట్వీట్ చేస్తూ.. 'మన ఆటగాళ్లు దేశానికి గర్వకారణం. వారు ప్రపంచ స్థాయిలో తమ ప్రదర్శనతో దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెడతారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, దాని అధ్యక్షుడిపై క్రీడాకారులు తీవ్రమైన ఆరోపణలు చేశారనీ, వారి గొంతులను వినాలని ఆమె అన్నారు.

 

 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !