గర్ల్‌ఫ్రెండ్ ఇంటికి లవర్, మాజీ లవర్.. రిలేషన్‌షిప్‌ గురించి ప్రశ్నిస్తూ బాలికపై దాడి.. బావిలో దూకేసిన బాలిక

Published : Jan 19, 2023, 03:06 PM IST
గర్ల్‌ఫ్రెండ్ ఇంటికి లవర్, మాజీ లవర్.. రిలేషన్‌షిప్‌ గురించి ప్రశ్నిస్తూ బాలికపై దాడి.. బావిలో దూకేసిన బాలిక

సారాంశం

మధ్యప్రదేశ్‌లో ఓ బాలిక ఇంటికి ఆమె ప్రస్తుత లవర్, మాజీ లవర్ వెళ్లారు. రిలేషన్‌షిప్ గురించి వారిద్దరూ ఆమె పై ప్రశ్నలు కురిపించారు. ఇద్దరూ ఆమె పై దాడి చేయడంతో మరో దారి లేక బావిలో దూకేసింది.  

భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఓ మైనర్ బాలిక బావిలో దూకేసింది. ఆమె మాజీ లవర్, ప్రస్తుత లవర్ ఇద్దరు కలిసి గర్ల్‌ఫ్రెండ్ ఇంటికి వెళ్లారు. ఆమె రిలేషన్‌షిప్ పై వాస్తవాలు చెప్పాలని డిమాండ్ చేస్తూ దాడి మొదలు పెట్టారు. అమ్మాయి ఇంటిలో గందరగోళం సృష్టించారు. వారి దాడి నుంచి తప్పించుకోవడానికి మరో దారి లేక ఆ బాలిక బావిలో దూకేసింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని బేతుల్‌లో బొర్దేహీ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది.

బేతుల్‌లోని ఆ బాలిక ఇంటికి లవర్, మాజీ లవర్ సహా ఐదుగురు కత్తులు, కర్రలతో వెళ్లారు. ఆ మాజీ లవర్, లవర్‌లు బాలికపై దూషణల పర్వం మొదలుపెట్టారు. దాడి చేశారు. ఆమె బావిలో దూకింది. స్థానికులు ఆమె బావిలో దూకడాన్ని చూసి పరుగున అక్కడికి వెళ్లారు. బావిలో దూకి రక్షించారు. ఆమెను బొర్దేహిలోని సమీప ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి దిగజారడంతో జిల్లా హాస్పిటల్‌కు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు  తెలుస్తున్నది.

Also Read: బ‌తికుండ‌గా వ‌ద్ద‌న్నారు.. చ‌చ్చాక ఇద్ద‌రికీ పెండ్లి చేశారు.. అంతులేని ప్రేమ‌క‌థ !

బాలిక ఇంటిలోకి చొరబడిన ఇద్దరిని గ్రామస్తులు పట్టుకున్నారు. పోలీసులకు అప్పగించారు. వారిద్దరినీ పోలీసులు ప్రస్తుతం విచారిస్తున్నారు. 

ఆ అమ్మాయి తన మాజీ ప్రియుడితో మాట్లాడటం మానేసింది. దీంతో అతను సీరియస్ అయ్యాడు. ఆ తర్వాత ఆ బాలిక ప్రస్తుత లవర్, మాజీ లవర్‌లు కలిశారు. వారిద్దరూ ఆమెను నిలదీయాలని నిర్ణయం తీసుకున్నారు. అనంతరం, ఆ ముగ్గురి మధ్య గొడవ మొదలైంది. 

బాలిక తండ్రి తన ఇంటికి వచ్చి కుమార్తెపై దాడికి పాల్పడ్డ వారిపై బొర్దేహీ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇప్పటి వరకు ఇద్దరిని అరెస్టు చేశారు. మిగితా వారి కోసం గాలింపులు జరుపుతున్నారు.

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం