
ఢిల్లీ : ఢిల్లీలోని వికాస్పురిలో 10 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులు జరిగినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. ఈ నేరానికి పాల్పడిన నిందితుడిని సీసీ కెమెరాల సహాయంతో గుర్తించి, అరెస్ట్ చేసినట్లు వారు తెలిపారు. ఈ నేరానికి సంబంధించి సోమవారం వికాస్‌పురి పోలీస్ స్టేషన్‌కు పిసిఆర్ కాల్ వచ్చిందని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
సమాచారం అందుకున్న తర్వాత, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లారు, అక్కడ ఆమెకు వైద్య పరీక్షలు, కౌన్సెలింగ్ నిర్వహించామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (పశ్చిమ) విచిత్ర వీర్ తెలిపారు.
భార్యతో శారీరకసంబంధం నిరాకరించడం నేరం కాదు...హైకోర్టు
ఐపీసీ సెక్షన్లు, లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు అధికారి తెలిపారు.
ఇదిలా ఉండగా, ఏపీలోని కర్నూలులో ఇలాంటి ఘోరమే వెలుగు చూసింది. ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం గంజిల్లలో దారుణం జరిగింది. బోడెమ్మ, బడేసాబ్ భార్యాభర్తలు. వీరి నిర్వాకం మీద గ్రామస్తులు ఆందోళనకు దిగారు. బోడెమ్మ గ్రామంలోని ఓ బాలికను మభ్యపెట్టి.. భర్త బడేసాబ్ దగ్గరికి తీసుకువెళ్లింది. ఆ బాలిక మీద బడేసాబ్ లైంగిక దాడికి ప్రయత్నించాడు.
దీంతో ఆ బాలిక ఎలాగో అతడినుంచి తప్పించుకుని.. ఇంటికి చేరుకుంది. విషయం తెలియడంతో బాధిత బాలిక కుటుంబసభ్యులు, గ్రామస్తులు భార్యాభర్తల తీరుపై మండిపడ్డారు. వారిద్దరినీ అరెస్ట్ చేయాలంటూ గ్రామంలో నిరసన తెలిపారు. విషయం తెలియడంతో పోలీసులు గ్రామానికి వచ్చి.. భార్యాభర్తలిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. బాధిత బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.