స్కూల్ టాయిలెట్ లో బాలికలపై లైంగికదాడి.. పైకప్పు విరగ్గొట్టి...లోపలికి దూరి.. దారుణం..

Published : Mar 10, 2023, 07:40 AM IST
స్కూల్ టాయిలెట్ లో బాలికలపై లైంగికదాడి.. పైకప్పు విరగ్గొట్టి...లోపలికి దూరి.. దారుణం..

సారాంశం

మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి మరుగుదొడ్డి పై కప్పు విరగ్గొట్టి అందులో ఉన్న బాలిక మీద అత్యాచారానికి పాల్పడ్డాడు. మరో బాలిక తప్పించుకుంది. 

బీహార్ : చిన్నారులు ఒంటరిగా కనిపిస్తే చాలు కామాంధులు వదలడం లేదు. ఏదో రకంగా వారిపై లైంగిక దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. జరుగుతున్న ఘటనల నేపథ్యంలో కాస్త అవగాహన ఉన్న చిన్నారులు తప్పించుకోవడానికి ప్రయత్నించినా.. వెంటాడి, వేటాడి..  వారిని భయాందోళనలకు గురిచేసి మరీ అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.  అలాంటి ఓ ఘటన బీహార్లోని బెగుసరాయి జిల్లాలో జరిగింది. ఇద్దరు చిన్నారులపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలలోకి వెళితే..

బెగుసరాయి జిల్లాలోని ఓ పాఠశాలలో ఇద్దరు బాలికలు ఆడుకుంటున్నారు, వారి మీద ఓ వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు,  ఆ వ్యక్తి చేష్టలు వికృతంగా అనిపించడంతో భయాందోళనకు గురైన ఆ బాలికలు ఇద్దరు స్కూల్లోని  టాయిలెట్ లోకి వెళ్లి దాక్కున్నారు.  అయితే నిందితుడు  మరుగుదొడ్డి పైకప్పును విరగొట్టి టాయిలెట్ లోకి ప్రవేశించాడు. వారి మీద అత్యాచారయత్నం చేశాడు. ఈ విషయం తెలిసి పోలీసులు సదరు వ్యక్తి మీద కేసు నమోదు చేశారు.  బుధవారం  ఉదయం ఈ ఘటన జరిగింది.

నాలుగేళ్ల చిన్నారిపై దూసుకెళ్లిన ఎద్దు.. తీవ్రగాయాలతో..

బాధిత బాలికలు ఇద్దరు పాఠశాల ఆవరణలో ఉన్న ఉయ్యాలను ఊగేందుకు వెళ్లారు. పాఠశాలలోనే ఉన్న ఛోటూ మహాతో అనే వ్యక్తి వారిద్దరిని చూశాడు. బాలికల దగ్గరికి వచ్చి వారి మీద లైంగిక వేధింపులకు  పాల్పడడం ప్రారంభించాడు. అతడి చేష్టలకు ఇద్దరు బాలికలు బెదిరిపోయారు. వారిని బయటికి వెళ్ళనీయకుండా అతడు అడ్డుపడుతుండడంతో పరిగెత్తి టాయిలెట్లోకి వెళ్లారు. అక్కడ దాక్కున్నాడు. అది ఛోటూ మహాతో గమనించాడు. 

వెంటనే టాయిలెట్ తలుపులు ఎంత కొట్టినా బాలికలు తీయకపోవడంతో.. మరుగుదొడ్డి పైకప్పు పగలగొట్టాడు. అందులో నుంచి లోపలికి దూరాడు. ఆ తర్వాత  ఓ బాలిక మీద లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో మరో చిన్నారి అక్కడి నుంచి తప్పించుకుని బయటపడింది. వెంటనే తమ కుటుంబ సభ్యులకు వివరాలు తెలపడంతో వారు అక్కడికి చేరుకుని అమ్మాయిని రక్షించారు.  బాలికలు ఇద్దరిని ఆసుపత్రిలో చేర్పించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి వచ్చిన వారు ఛోటూ మహాతోను అరెస్టు చేశారు. 

ఇదిలా ఉండగా, ఫిబ్రవరి 8న ఇలాంటి దారుణ ఘటనే హైదరాబాద్ లో వెలుగు చూసింది. నగరంలోని చాంద్రాయణగుట్టలో ఓ బాలికపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మెడికల్  షాప్ దగ్గరికి మందుల కోసం వెళ్లిన బాలికను గమనించిన ఓ మహిళ ట్రాప్ చేసింది.  తక్కువ ధరకు మందులను ఇప్పిస్తానని చెప్పి బాలికను తన వెంట మహిళ తీసుకెళ్లింది. ఆ తరువాత బాలికను ఓ నలుగురు వ్యక్తులకు అప్పగించింది. 

అప్పటికే గంజాయి తాగి, మత్తులో ఉన్న ఆ నలుగురు యువకులు బాలికను గదిలో బంధించి బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతకుముందు బాలికకు బలవంతంగా మద్యం తాగించారు. అత్యాచారానికి పాల్పడిన తర్వాత నిందితులు ఆ బాలికను వదిలిపెట్టారు. మందుల కోసం వెళ్లి.. దారుణమైన స్థితిలో ఇంటికి వచ్చిన బాలికను తల్లిదండ్రులు ప్రశ్నించగా.. విషయం చెప్పింది. వెంటనే వారు పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి  ఫిర్యాదు మేరకు  పోలీసులు కేసు నమోదు  చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?
Indian Railways : ఇండియన్ రైల్వే బంపర్ ఆఫర్.. తక్కువ ఖర్చుతో దేశమంతా తిరిగేయండిలా !