రోడ్డు మీద నిలుచున్న చిన్నారిని ఓ ఎద్దు దారుణంగా కుమ్మేసింది. అంతటితో ఆగకుండా ఆ చిన్నారి మీదే కూర్చుండిపోయింది. ఇది గమనించిన స్థానికులు చిన్నారిని బయటకు తీసి ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీగఢ్ పట్టణంలోని జరిగింది.
హైదరాబాద్ లో వీధి కుక్కల దాడిలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయిన అనంతరం.. తెలుగు రాష్ట్రాల్లో వీధి కుక్కల మీద పెద్ద చర్చ జరుగుతోంది. అయితే కుక్కలే కాదు.. బహిరంగ ప్రదేశాల్లో సంచరించే సమయంలో ఏ జంతువైనా ప్రమాదకరమేనని చెప్పాలి. తాజాగా నెట్టింట్లో ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. నాలుగేళ్ల చిన్నారిపై ఓ ఎద్దు దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది.
అంతటితో ఆగకుండా.. ఆ ఎద్దు ఈ చిన్నారిపై కూర్చుంది. ఈ ఘటనలో చిన్నారికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని అలీగఢ్ పట్టణంలోని తానా గాంధీ పార్క్ సమీపంలో ఉన్న ధనిపూర్ మండిలో జరిగిన దారుణం ఇది. ఈ ఘటన స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కావడంతో జరిగిన సంఘటన వెలుగులోకి వచ్చింది.
undefined
సీసీటీవీ పుటేజీ ప్రకారం..ఉత్తరప్రదేశ్ లోని అలీగఢ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఓ చిన్నారి తన తాతతో కలిసి బయటకెళ్లాడు. ఇంతలో గల్లీ వెంట వచ్చిన ఓ ఎద్దు వచ్చింది. ఆ చిన్నారిని చూసిన ఎద్దు ఒక్కసారిగా మీదికి వచ్చింది. ఆ ఎద్దు దాడిలో ఆ చిన్నారి ఎగిరిపడి.. స్పృహ కోల్పోయాడు. అనంతరం ఆ ఎద్దు చిన్నారి మీదే కూర్చుంది. వెంటనే పక్కన ఇంట్లో నుంచి ఒక వ్యక్తి వచ్చి.. ఆ ఎద్దు కింద ఉన్న చిన్నారిని బయటికి తీశాడు.
In UP's Aligarh, a stray bull hit a toddler and crushed it. The toddler is in hospital. Stray cattle menace continues pose serious threat to people. pic.twitter.com/GGUk9FgVUg
— Waquar Hasan (@WaqarHasan1231)అనంతరం చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం చిన్నారి విషమ పరిస్థితిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఘటనపై స్థానికుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన అధికారులు ఎద్దును బంధించి.. వేరే చోటుకు తరలించారు. చిన్నారిపై ఎద్దు దాడి చేసిన వీడియో.. సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.