లైంగిక వేధింపులకు వ్యతిరేకించిందని ఏడేళ్ల చిన్నారిని దారుణంగా హతమార్చాడో వ్యక్తి. అతను బాలికకు బంధువే కావడం గమనార్హం.
ఉత్తరప్రదేశ్ : ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో అమానుష ఘటన వెలుగు చూసింది. ఓ ఏడేళ్ల బాలికను అత్యంత పాశవికంగా హతమార్చాడో బంధువు. ఆ చిన్నారిని అనుచితంగా తాకుతుండడంతో.. దానికి ఆమెప్రతిఘటించింది. దీంతో ఆమెను ఊపిరిఆడకుండా చేసి, చంపినట్లు పోలీసులు శనివారం తెలిపారు.
ఈ కేసు వెలుగులోకి రావడంతో నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాలిక కైలా భట్టా ప్రాంతంలోని తన మేనమామ ఇంటికి వచ్చినప్పుడు ఈ దారుణ ఘటన జరిగిందని వారు తెలిపారు. మేనమామ ఇంటికి వచ్చిన బాలికను శుక్రవారం రాత్రి ఓ బంధువు తినుబండారాలు ఇస్తానని చెప్పి.. పక్క ఇంటి టెర్రస్‌పైకితన వెంట తీసుకెళ్లాడు. అక్కడ ఆ చిన్నారిని అసభ్యంగా తాకడం ప్రారంభించాడు. \
నైనిటాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. లోయ పడ్డ టూరిస్ట్ బస్సు.. 7 మంది మృతి
దీనికి ఆ చిన్నారి అభ్యంతరం చెప్పింది. దీంతో తన గుట్టు బయటపడుతుందని భావించిన అతను ఆమె నోరు గట్టిగా మూశాడు. దీంతో చిన్నారి ఊపిరి ఆడక మృతి చెందినట్లు నగరం డీఎస్పీ నిపున్ అగర్వాల్ తెలిపారు.
నోరు నొక్కేయడంతో బాలిక అపస్మారక స్థితిలో పడిపోయింది. దీంతో చనిపోయిందని భావించిన నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. బాలిక కనిపించకపోవడంతో వెతకడం ప్రారంభించిన కుటుంబసభ్యులకు.. టెర్రస్ పై అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను కుటుంబ సభ్యులు గుర్తించారు. వెంటనే బాలిక మేనమామ ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు ఆమె చనిపోయినట్లు ప్రకటించారు.
"భారతీయ శిక్షాస్మృతి (IPC), లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (POCSO) చట్టంలోని సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. నిందితుడిని అరెస్టు చేశాం’’ అని డీఎస్పీ తెలిపారు.