నైనిటాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. లోయ పడ్డ టూరిస్ట్ బస్సు.. 7 మంది మృతి 

By Rajesh Karampoori  |  First Published Oct 9, 2023, 5:43 AM IST

నైనిటాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పర్యాటకులతో నిండిన బస్సు నళిని ప్రాంతంలో లోతైన లోయలో పడింది. బాటసారులతో సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు.ఈ ప్రమాదంలో 7 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
 


హర్యానాలోని నైనిటాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నగరానికి సమీపంలోని నళిని ప్రాంతంలో పర్యాటకులతో వెళ్తున్న బస్సు లోతైన లోయలో పడిపోయింది. స్థానికులు .. పోలీసులకు సమాచారం అందించగా.. వెంటనే పోలీసులు, ఎస్‌డిఆర్‌ఎఫ్, అగ్నిమాపక దళం బృందాలు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన ప్రయాణికులను బయటకు తీసే పనిలో నిమగ్నమయ్యాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది.

ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. నైనిటాల్ నుండి హర్యానాకు తిరిగి వస్తుండగా, కలదుంగి నైనిటాల్ రహదారిపై ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 32 మంది ఉన్నారు. క్షతగాత్రులను రక్షించి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కలాధుంగికి తరలించారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన వారిని STH హల్ద్వానీకి తరలించారు. సమాచారం అందుకున్న ఎస్‌ఎస్పీ ప్రహ్లాద్ నారాయణ్ మీనాతో సహా మొత్తం బృందం సహాయక చర్యల్లో నిమగ్నమై ఉంది.  గాయపడిన వారిని హల్ద్వానీలోని సుశీల తివారీ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు.

Latest Videos

 గాయపడిన ప్రయాణికులను విచారించగా, బస్సులో 32 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నట్లు సమాచారం అందిందని ఎస్‌ఎస్పీ ప్రహ్లాద్ నారాయణ్ మీనా తెలిపారు. లోయ గాయపడిన వారి కోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని తెలిపారు.

click me!