
ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. చమోలీ జిల్లాలోని అలకనంద నది ఒడ్డున ట్రాన్స్‌ఫార్మర్ పేలిన ఘటనలో 10 మంది మృతి చెందారు. విద్యుదాఘాతంతో వారు మరణించారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. గాయపడిన వారిని వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించారు. వారికి ప్రస్తుతం చికిత్స జరుగుతుందని వైద్య పరీక్షల తర్వాతే వారి పరిస్థితి తెలుస్తోందని అధికారులు తెలిపారు.
నమామి గంగే ప్రాజెక్టు వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో బద్రీనాథ్ హైవేపై ఉన్న పోలీస్ అవుట్‌పోస్ట్ ఇన్‌చార్జి కూడా మృతి చెందినట్లు ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్‌కుమార్ తెలిపారు.