2024 లోక్ సభ ఎన్నికల్లో బీఎస్పీ ఒంటరిగానే పోటీ చేస్తుంది.. కాంగ్రెస్ హమీలన్నీ బూటకమే - మాయావతి

Published : Jul 19, 2023, 12:40 PM IST
2024 లోక్ సభ ఎన్నికల్లో బీఎస్పీ ఒంటరిగానే పోటీ చేస్తుంది.. కాంగ్రెస్ హమీలన్నీ బూటకమే -  మాయావతి

సారాంశం

తమ పార్టీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని చెప్పారు. 26 ప్రతిపక్ష పార్టీలో బెంగళూరులో, 39 పార్టీలో బీజేపీ మిత్రపక్షాలు ఢిల్లీలో మంగళవారం సమావేశం ఏర్పాటు చేసుకున్న నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

బీఎస్పీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని, రాబోయే లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ చీఫ్ మాయావతి స్పష్టం చేశారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో పార్టీ సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయని అన్నారు. దేశవ్యాప్తంగా సమావేశాలు కూడా నిర్వహిస్తున్నామని చెప్పారు. 

2024 లోక్ సభ ఎన్నికలకు ముందు జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ), ప్రతిపక్ష పార్టీలు తమ రాజకీయ బలాన్ని పెంచుకోవడానికి సమావేశాలు ఏర్పాటు చేసిన మరుసటి రోజే బుధవారం ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా ఎన్డీయే కూటమిపై కూడా బీఎస్పీ అధినేత్రి ప్రశ్నలు సంధించారు. కాంగ్రెస్ హామీలు బూటకమని, అధికారంలోకి రావడానికే ఆ పార్టీ పొత్తులు కుదుర్చుకుంటోందని విమర్శించారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని అన్నారు. అయితే పంజాబ్, హర్యానా తదితర రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకోవచ్చని ఆమె చెప్పారు. 
 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?