బస్సును ఢీకొన్న బొగ్గు లోడ్‌తో వెళ్తున్న లారీ.. ఆరుగురు మృతి..

By Sumanth KanukulaFirst Published Jan 22, 2022, 5:17 PM IST
Highlights

ఒడిశాలో (Odisha) ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బాలాసోర్ జిల్లాలోని (Balasore district) సోరో పోలీసు స్టేషన్ పరిధిలో NH-16‌పై బిదు చక్ వద్ద బస్సును బొగ్గు లోడ్‌తో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. శనివారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. 

ఒడిశాలో (Odisha) ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బాలాసోర్ జిల్లాలోని (Balasore district) సోరో పోలీసు స్టేషన్ పరిధిలో NH-16‌పై బిదు చక్ వద్ద బస్సును బొగ్గు లోడ్‌తో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. శనివారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే గాయపడినవారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. ‘శాంతిలత’ అనే పేరుతో ఉన్న బస్సు Mayurbhanj districtలోని మనత్రి నుంచి ఉడాలా మీదుగా భువనేశ్వర్‌కు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 

శనివారం మధ్యాహ్నం సమయంలో సోరో సమీపంలోని బస్ స్టాప్ వద్ద బస్సు ఆగి ఉన్న సమయంలో.. బొగ్గుతో కూడి ట్రక్కు వేగంగా దూసుకొచ్చి వెనకాల నుంచి బస్సును బలంగా ఢీకొట్టింది. దీంతో బస్సు అదుపుతప్పి రోడ్డుపై నుంచి పక్కకు పడిపోయింది. దీంతో ఘటన స్థలంలోనే ముగ్గురు మరణించారు. మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతు మృతిచెందారు. మృతుల్లో ఏడాది చిన్నారి కూడా ఉన్నారు.ః

ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు. స్థానికుల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన వారిని సోరోలోని ఆస్పత్రి, బాలసోర్ జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

మరో ప్రమాదంలో ఐదుగురు మృతి.. 
ఒడిశాలోని సోనేపూర్ జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. మరో ఐదురుగు తీవ్రంగా గాయపడ్డారు. జిల్లాలోని మహానది వంతెనపై ట్రక్కును ఎస్‌యూవీ వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎస్‌యూవీ వాహనం పూర్తిగా దెబ్బతింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు, ఇతర రెస్క్యూ టీమ్‌లు గ్యాస్ కట్టర్‌ల సహాయంతో బాగా చితికిపోయిన వాహనం నుండి ఐదుగురికి రక్షించి.. ఆస్పత్రులకు తరలించారు. 

ఈ ప్రమాదంపై సోనేపూర్ పోలీసు ఉన్నతాధికారులు మాట్లాడుతూ..  ‘సోనేపూర్ జిల్లా ఉల్లుందా బ్లాక్ పరిధిలోని నిమ్మా, పంచమహాల గ్రామానికి చెందిన 10 మంది కౌడియాముండా గ్రామంలో ఒక వివాహ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా తెల్లవారుజామున 1 గంటల సమయంలో ప్రమాదం జరిగింది. వారు ప్రయాణిస్తున్న బొలెరో జీపు మహానది వంతెనపై ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రమోద్ పాండియా, త్రయంబక్ మెహర్, శుభం పాండియాతో పాటు ఆశిష్ పాండియా, అతని కుమార్తె సిద్ధి పాండియా అక్కడికక్కడే మరణించారు’ అని తెలిపారు. 

click me!