5 State Assembly elections: ర్యాలీలు, రోడ్‌షోలు.. నిషేధం ఎత్తివేతపై ఈసీ కీలక భేటీ

Siva Kodati |  
Published : Jan 22, 2022, 05:15 PM IST
5 State Assembly elections: ర్యాలీలు, రోడ్‌షోలు.. నిషేధం ఎత్తివేతపై ఈసీ కీలక భేటీ

సారాంశం

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో అభ్యర్థుల ప్రచారంపై సందిగ్థత నెలకొంది. బహిరంగ సభలు, ర్యాలీలపై ఈసీ విధించిన నిషేధం నేటితో ముగియనుంది. అయితే కోవిడ్ ఉద్ధృతి ఎక్కువ వుండటంతో నిషేధం పొడిగించాలని భావిస్తోంది ఈసీ. దీనికి సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ నిపుణులు , ఐదు రాష్ట్రాల ఎన్నికల అధికారులతో వర్చువల్ సమావేశం నిర్వహిస్తూ వారి అభిప్రాయాలను తెలుసుకుంటోంది

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో అభ్యర్థుల ప్రచారంపై సందిగ్థత నెలకొంది. బహిరంగ సభలు, ర్యాలీలపై ఈసీ విధించిన నిషేధం నేటితో ముగియనుంది. అయితే కోవిడ్ ఉద్ధృతి ఎక్కువ వుండటంతో నిషేధం పొడిగించాలని భావిస్తోంది ఈసీ. దీనికి సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ నిపుణులు , ఐదు రాష్ట్రాల ఎన్నికల అధికారులతో వర్చువల్ సమావేశం నిర్వహిస్తూ వారి అభిప్రాయాలను తెలుసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఇండోర్ సమావేశాలకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి మంజూరు చేసినట్లుగా తెలుస్తోంది. 50 శాతం ఆక్యూపెన్సీతో ఇండోర్ మీటింగ్స్ నిర్వహించుకోవచ్చని తెలిపింది. 

కాగా.. పెరుగుతున్న కరోనా కేసుల మధ్య జనవరి 22వ తేదీ వ‌ర‌కు బహిరంగ ర్యాలీలు, రోడ్‌షోలు (road shows), స‌మావేశాల నిషేధిస్తూ కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ (central election commission) జ‌న‌వ‌రి 8వ తేదీన నిర్ణ‌యించింది. అదే రోజు ఉత్తరప్రదేశ్ (uthara pradhesh), ఉత్తరాఖండ్ (utharakhand), గోవా (goa), పంజాబ్ (punjab), మణిపూర్ (manipur) రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కూడా ప్రకటించింది. అయితే కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేప‌థ్యంలో.. క్షేత్ర స్థాయిలో ప‌రిస్థితుల‌ను ప‌రిశీలించి, స‌మీక్ష జ‌రిపిన త‌రువాత నిషేదాన్ని పొడ‌గించాలా ? వ‌ద్దా అనే నిర్ణ‌యంలో ఈసీ (ec)నిర్ణ‌యం తీసుకోనుంది. 

బహిరంగ స‌భలు, స‌మావేశాలు, రోడ్ షోలు నిషేధించ‌డంతో పాటు ఎన్నిక‌ల ప్ర‌చారం కోసం అనుసరించాల్సిన 16 పాయింట్ల మార్గ‌ద‌ర్శ‌కాల‌ను (16 points guidelines) కూడా కేంద్ర ఎన్నిక‌ల సంఘం (central election commission) జారీ చేసింది. ఈ మార్గ‌ద‌ర్శ‌కాల ప్రకారం..  ఇంటింటికి ప్రచారానికి వెళ్లే వారిలో అభ్య‌ర్థితో పాటు మ‌రో ఐదుగురు మాత్ర‌మే అనుమ‌తి ఉంటుంది. ఓట్ల లెక్కింపు త‌రువాత విజయోత్స‌వ ర్యాలీలు కూడా నిషేధించింది. 

క‌రోనా (corona) కేసుల పెరుగుద‌ల నేప‌థ్యంలో ఎన్నిక‌ల ప్ర‌చారంలో మార్పులు తీసుకురావాలని ఎన్నిక‌ల సంఘం భావిస్తోంది. అందులో భాగంగా డిజిట‌ల్ మీడియా (digital media) ద్వారా ప్ర‌చారం చేసుకోవాల‌ని పార్టీల‌కు సూచిస్తోంది. దీని కోసం ప్రసార భారతి కార్పొరేషన్‌తో సంప్రదించి ప్రతీ జాతీయ పార్టీకి కేటాయించిన టెలికాస్ట్ సమయాన్ని (telicast time) రెట్టింపు చేయాలని నిర్ణయించింది. ఈ మేర‌కు ఎన్నిక‌ల సంఘం శుక్ర‌వారం ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. 

అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో  ఉత్తరప్రదేశ్ (uthara pradhesh) శాసనసభ గడువు మే నెలతో, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ శాసనసభల గడువు మార్చి నెలలో వివిధ తేదీల్లో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 8వ తేదీన షెడ్యూల్‌ను ప్రకటించింది. యూపీలో 403, ఉత్తరాఖండ్‌లో  70, పంజాబ్‌లో 117, గోవాలో  40, మణిపూర్‌లో 60 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 మధ్య ఏడు దశల్లో జరగనుండగా, మార్చి 10న ఓట్ల లెక్కింపు ఉంటుంది.

PREV
click me!

Recommended Stories

IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !
Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !