అదుపుతప్పి తుంగభద్ర కాలువలో పడిపోయిన ఆటో.. ముగ్గురు మృతి, మరో ముగ్గురు గల్లంతు

Published : Sep 14, 2022, 01:56 PM IST
అదుపుతప్పి తుంగభద్ర కాలువలో పడిపోయిన ఆటో.. ముగ్గురు మృతి, మరో ముగ్గురు గల్లంతు

సారాంశం

కర్ణాటకలోని బళ్లారి  తాలుకా కొలగల్ సమీపంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పొలం పనుల కోసం కూలీలతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి తుంగభద్ర కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా, మరో ముగ్గురు గల్లంతయ్యారు.

కర్ణాటకలోని బళ్లారి  తాలుకా కొలగల్ సమీపంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పొలం పనుల కోసం కూలీలతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి తుంగభద్ర కాలువలో పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా.. ఒక్కరు ఆస్ప్రతిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. మరో ముగ్గురు కాలువలో గల్లంతయ్యారు. కొందరు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో 11 మంది ఉన్నట్టుగా చెబుతున్నారు. 

ఈ ప్రమాదంపై కర్ణాటక మంత్రి బి శ్రీరాములు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. కాలువలో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. తుంగభద్ర కాలువ పొంగిపొర్లడంతో  సహాయక చర్యలకు స్వల్ప ఆటంకం ఏర్పడిందని చెప్పారు. అయితే ఆ తర్వాత గల్లంతైన వారిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఆసుపత్రిలో చేరిన వారికి తగిన చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు. నీటిలో గల్లంతైనవారు క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థిస్తున్నట్టుగా చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

దేశంలో బెస్ట్ ప్రధాని ఎవరు? సీఎంలలో ఆ ముగ్గురే తోపు | Best Prime Minister of India | Best CM
ట్రైన్ లో వాటర్ ఎలా సప్లై అవుతుంది? నీళ్లు ఎక్కడ స్టోర్ చేస్తారు? | Railway Quick Watering System