అహ్మదాబాద్‌లో కుప్పకూలిన లిఫ్ట్.. 8 మంది మృతి

Published : Sep 14, 2022, 01:13 PM ISTUpdated : Sep 14, 2022, 03:08 PM IST
అహ్మదాబాద్‌లో కుప్పకూలిన లిఫ్ట్.. 8 మంది మృతి

సారాంశం

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అహ్మదాబాద్‌లో నిర్మాణంలో  ఉన్న భవనంలోని లిఫ్ట్‌ కుప్పకూలడంతో 8 మంది మృతిచెందారు.

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అహ్మదాబాద్‌లో నిర్మాణంలో  ఉన్న భవనంలోని లిఫ్ట్‌ కుప్పకూలడంతో 8 మంది మృతిచెందారు. మృతులంతా కూలీలుగా తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో లిఫ్ట్‌లో ఎంతమంది ఉన్నారనే తెలియాల్సి ఉంది. ఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ఇక, గుజరాత్ యూనివర్సిటీ క్యాంపస్ సమీపంలో ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. ‘‘ప్రాథమిక విచారణలో కార్మికులను తీసుకెళ్తున్న లిఫ్ట్ ఏడో అంతస్థు నుంచి కుప్పకూలింది. ఎనిమిది మంది కార్మికులు మరణించారు’’ అని జోన్ 1 డిప్యూటీ పోలీస్ కమిషనర్ లవీనా సిన్హా తెలిపారు. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu
PM Narendra Modi: దేశం గర్వపడేలా.. సౌదీ రాజులు దిగివచ్చి మోదీకి స్వాగతం| Asianet News Telugu