గోవాలో కాంగ్రెస్ కు షాక్: బీజేపీలో చేరిన ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

By narsimha lodeFirst Published Sep 14, 2022, 1:41 PM IST
Highlights

గోవా రాష్ట్రంలో కాంగ్రెస్ కు షాక్ తగిలింది. ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బుధవారం నాడు బీజేపీలో చేరారు. 

పనాజీ: గోవాలో కాంగ్రెస్ కు భారీ షాక్ తగిలింది. ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బుధవారం నాడు బీజేపీలో చేరారు. గోవా సీఎం ప్రమోద్ సావంత్ సమక్షంలో ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు.గోవాలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న 11 మంది ఎమ్మెల్యేల్లో ఎనిమిది మంది ఇావాళ బీజేపీలో చేరారు. కొంతకాలంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరుతారనే ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే. గోవా మాజీ ముఖ్యమంత్రి దిగంబర్ కామత్, విపక్ష నేత మైఖేల్ లోబో, ఆయన భార్య దెలీలా లోబో, కేదార్ నాయక్, రుడాల్పో పెర్నాండెజ్, మాజీ విద్యుత్ శాఖ మంత్రి అలెక్సో, సిక్సేరా, రాజేస్ పాల్ దేశాయ్, సంకల్ప్ అమోంకర్ లున్నారు.బీజేపీలో చేరిన తర్వాత మైఖేల్ లోబీ మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోడీ, గోవా సీఎం ప్రమోద్ సావంత్ ల నాయకత్వాలను బలోపేతం చేయాలనే ఉద్దేశ్యంతో బీజేపీలో చేరినట్టుగా ఆయన చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ శాసనసభపక్షాన్ని బీజేపీలో విలీనం చేసినట్టుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీ సెక్రటరీకి ఇవాళ లేఖను అందించారు. ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరినట్టుగా గోవా సీఎం ప్రమోద్ సావంత్ చెప్పారు. కాంగ్రెస్ శాసనసభపక్షం బీజేపీలో విలీన ప్రక్రియ పూర్తి కానుందని ఆయ న చెప్పారు. మోడీ నాయకత్వాన్ని బలపర్చేందుకు గాను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ నిర్ణయం తీసుకున్నారని  సావంత్ చెప్పారు. మాకు అండగా నిలిచేందుకు వచ్చిన వారిని స్వాగతిస్తున్నట్టుగా గోవా సీఎం ప్రమోద్ సావంత్ చెప్పారు. ఇదొక చారిత్రాత్మక నిర్ణయంగా ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు సరిగా లేవని ఆయన  మాజీ సీఎం కామత్ అభిప్రాయపడ్డారు. 

2019 లో 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మహరాష్ట్ర వాది గోమంతక్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు బీజేపీ శాసనసభపక్షంలో విలీనమయ్యారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు బీజేపీ శాసనసభపక్షంలో విలీనం  కావడంతో  ప్రభుత్వ బలం 33 మందికి చేరింది., మొత్తం 40 మంది ఎమ్మెల్యేలు ఉన్న అసెంబ్లీలో  బీజేపీ 20 మంది ఎమ్మెల్యేలను గెలుచుకుంది. ఎంజీపీ నుండి ఇద్దరు, ముగ్గురు ఇండిపెండెంట్ల మద్దతుతో ఈ ఏడాది మార్చిలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఏడాది జూలై మాసంలోనే  బీజేపీలోకి ఫిరాయింపులను ప్రోత్సహించినట్టుగా కాంగ్రెస్ ఆరోపించిన విషయం తెలిసిందే. 


 

click me!