కోల్‌కతాలో ఘోర రోడ్డు  ప్రమాదం.. ఇద్దరు మృతి .. పలువురికి తీవ్రగాయాలు.. 

By Rajesh KarampooriFirst Published Apr 1, 2023, 11:29 PM IST
Highlights

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో బస్సు ప్రమాదం జరిగింది. శనివారం సాయంత్రం సెంట్రల్ కోల్‌కతాలోని మాయో రోడ్ ప్రాంతంలో బస్సు బోల్తా పడింది. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. పలువురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. 

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం సాయంత్రం ప్రయాణికులతో కూడిన మినీ బస్సు మాయో రోడ్డులో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు ప్రయాణికుడు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెటియాబ్రూజ్-హౌరా మార్గంలో నడుపుతున్న మినీబస్సు సాయంత్రం 4.40 గంటల సమయంలో ప్రమాదం జరిగినప్పుడు మాయో రోడ్-డఫెరిన్ రోడ్ క్రాసింగ్ వైపు వెళుతోంది. హౌరా నుంచి కోల్‌కతాలోని మెటియాబ్రూజ్‌కు వెళ్తున్న బస్సు అదుపుతప్పింది. 

కాగా బస్సులో ఉన్న మరో 20 మంది ప్రయాణికులు గాయపడినట్లు సమాచారం. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఎస్‌ఎస్‌కెఎం ఆసుపత్రిలో చేర్పించారు. సమాచారం మేరకు మినీ బస్సు ఓవర్ టేక్ చేస్తుండగా అదుపు తప్పి బోల్తా పడింది.  మరణించిన ఓ ప్రయాణికుడి అజ్లాన్ ఖాన్ గా గుర్తించారు. మృతుల్లో మరో వ్యక్తి ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉంది. గాయపడిన వారు ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎస్‌ఎస్‌కెఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

గాయపడిన ప్రయాణికులను రక్షించి ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరగడంతో కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. అనంతరం పోలీసులు మినీ బస్సును ఓ వైపు క్రేన్‌ పెట్టి సరిచేయడంతో మళ్లీ ట్రాఫిక్‌ సాధారణమైంది. కాగా, శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనతో దారిన వెళ్లేవారిలో భయాందోళన నెలకొంది. మినీ బస్సు మెటియాబ్రూజ్ నుంచి హౌరా వెళ్తున్నట్లు తెలిసింది. ఆ సమయంలో మాయో రోడ్డు, డఫెరిన్ రోడ్డు కూడలి వద్దకు రాగానే బస్సు అదుపు తప్పి బోల్తా పడింది.

ఆ సమయంలో బస్సులో చాలా మంది ప్రయాణికులు ఉన్నారు. చాలా మంది బస్సులో చిక్కుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు అక్కడికి చేరుకున్నారు. బస్సు ముందు, వెనుక అద్దాలను పగులగొట్టి బస్సులోని ప్రయాణికులను బయటకు తీశారు. ప్రమాదం కారణంగా మాయో రోడ్డు, డఫెరిన్ రోడ్డు పక్కనే ఉన్న ప్రాంతంలో కొంతసేపు ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది.

click me!