From the IAF Vault: 21 నెలలు నిర్బంధంలో గడిపిన డకోటా ఫ్లైట్ సిబ్బంది.. వారి విజయగాధ ఇదీ

By Anchit GuptaFirst Published Apr 1, 2023, 9:31 PM IST
Highlights

1960 ఆగస్టు 26న నాగాల్యాండ్‌లోని పుర్ గ్రామంలో డకోటా ఫ్లైట్‌ను నేలకూల్చారు. ఆ డకోటా ఫ్లైట్‌లోని సిబ్బందిని నిర్బంధించారు. వారి విజయగాధను భారత వైమానిక దళ చరిత్రకారుడు అంచిత్ గుప్తా వివరిస్తున్నారు.
 

1960 సెప్టెంబర్ 5వ తేదీన అప్పటి రక్షణ మంత్రి వెంగలిల్ క్రిష్ణన్ క్రిష్ణ మీనన్ పార్లమెంటులో భారత వైమానిక దళానికి చెందిన డకోటా విమానం గురించి సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఆ ఫ్లైట్‌ను గస్టు 26న నాగాల్యాండ్‌లోని పుర్ గ్రామంలో నేలకూల్చారు. ఆ విమాన శకలాలను గుర్తించారు. కానీ, ఆ విమానంలోని సిబ్బంది మాత్రం కనిపించకుండాపోయారు. ఇది వారి కథ.

1960 ఆగస్టు 14వ తేదీన నాగా తిరుగుబాటుదారులు పుర్ గ్రామంలోని అసాం రైఫిల్స్ పోస్టుపై దాడి చేశారు. అది వర్షాలు ఉధృతంగా కురుస్తున్న కాలం. నదులు ఉప్పొంగుతున్నాయి. నదులపై వంతెనలను ధ్వంసం చేసిన తర్వాత ఆ పోస్టుపై దాడి ప్రారంభించారు. దాడి కొనసాగుతుండగా.. అసాం రైఫిల్స్ వద్దనున్న సప్లైలు, పేలుడు పదార్థాలు నిండుకున్నాయి. 

రెండు డకోటా విమానాలు జోర్హాట్ నుంచి ఆ పోస్టు వద్దకు సప్లైలు తరలించే పనిని భుజానికెత్తుకున్నాయి. అయితే, ఒక వైపు తిరుగుబాటుదారుల నుంచి దాడులు ఎదుర్కొంటూ ఈ సరఫరాలు చేయడం ఆషామాషీ వ్యవహారంగా లేదు. ఆ రెండు ఫ్లైట్‌లకు బుల్లెట్లతో రంధ్రాలు పడ్డాయి.

రెండో విమానం హెచ్‌జే 233లో నలుగురు క్రూ ఉన్నారు. ఫ్లైట్ లెఫ్టినెంట్ ఏఎస్ సింఘా, ఫ్లాగ్ ఆఫీసర్ ఆర్ఈ రాఫల్, ఫ్లాగ్ ఆఫీసర్ సీఎస్ మిశ్రా, సెర్జంట్ జేసీ చౌదరిలు ఉన్నారు. వీరితోపాటు ఐదుగురు ఎజెక్షన్ క్రూగా ఆర్మీమెన్లు ఉన్నారు. ఫస్ట్ డ్రాపింగ్ ఫైరింగ్ కారణంగా అనుకున్న చోటులో జరగలేకపోయింది.

రెండో ట్రిప్‌లో ఆ ఫ్లైట్ రెండు ఇంజిన్లకు ఫైరింగ్ వల్ల నష్టం జరిగింది. సమీపంలోని కొండ ప్రాంతంలో ఓ వ్యవసాయ క్షేత్రంలో ఫ్లైట్‌ను దింపగలిగాడు. ఆ ఫ్లైట్‌లోని సిబ్బందికి తీవ్ర గాయాలు కాలేవు. వారిపై కాల్పులు జరిగాయి. ఆ తర్వాత అందులోని నలుగురు క్రూ, ఐదుగురు ప్యాసింజర్లను నిర్బంధించారు.

Also Read: From the IAF Vault: భారత వైమానిక దళానికి మొదటి చీఫ్‌ను ఎలా ఎంపిక చేశారో తెలుసా? తెరవెనుక ఆసక్తికర పరిణామాలు

వారిని చేరుకోవడానికి నదులను దాటి వెళ్లడానికి ఐఏఎఫ్ మిషన్ ఆదేశించింది. కానీ, అది ప్రాణాంతకంగా పరిణమించింది. అయితే, సెప్టెంబర్ 3వ తేదీన ట్రూపులు ఆ డకోటా ఫ్లైట్ వద్దకు చేరుకోగలిగారు. కానీ, అందులోని సిబ్బంది కనిపించలేదు. వారి కోసం విమానాల ద్వారా గాలింపులు చేపట్టారు.

లండన్‌కు చెందిన ది అబ్జర్వర్ అనే పత్రిక ప్రతినిధి గేవిన్ యంగ్ నాగాల్యాండ్‌కు వచ్చాడు. ఆ క్రూతో ఇంటర్వ్యూ చేయగలిగాడు. నాగా హోం గార్డ్ క్యాంప్ వద్ద వారితో తాను కూర్చున్నానని పేర్కొన్నాడు. వారంతా బక్కచిక్కి ఉన్నారని, గడ్డం పెరిగిందని తెలిపాడు. బయటి ప్రపంచం నుంచి కొన్ని నెలల నుంచి వారు ఎలాంటి వార్తలు వినలేదని, అప్పుడు వారు క్రితం ఏడాది జరిగిన ఒలింపిక్ గేమ్స్‌లో విజేతలు ఎవరు అనే ప్రశ్నలు అడిగినట్టు వివరించాడు.

డకోటా క్రూ ఎట్టకేలకు 1962 మే 5న విడుదల అయ్యారు. వారు బర్మీస్ ఎయిర్ ఫోర్స్ ప్లేన్‌లో రంగూన్‌కు వచ్చారు. అప్పుడు ఐఏఎఫ్ వారిని రంగూన్ నుంచి ఢిల్లీకి 192 మే 12న తీసుకువచ్చింది. 617 రోజుల వారి నిర్బంధాన్ని ముగించింది.

 

-- (అంచిత్ గుప్తా మిలిటరీ కుటుంబంలో జన్మించారు. ఫైనాన్స్ ప్రొఫెషనల్. ప్రస్తుతం ఓ ప్రైవేటు ఈక్విటీ సంస్థలో మేనేజింగ్ డైరెక్టర్‌గా చేస్తున్నారు. భారత వైమానిక చరిత్రలో ఆయనకు ఆసక్తి ఎక్కువ. అందుకే భారత వాయు సేన చరిత్రను పలు వేదికలపై పంచుకుంటుంటారు.)

click me!