ప్రకృతి ప్రళయ ఘోష .. హిమాచల్‌లో పేక మేడల్లా కూలిన భవనాలు.. వీడియో వైర‌ల్ 

Published : Aug 24, 2023, 12:52 PM IST
ప్రకృతి ప్రళయ ఘోష .. హిమాచల్‌లో పేక మేడల్లా కూలిన భవనాలు.. వీడియో వైర‌ల్ 

సారాంశం

హిమాచల్‌లో ప్రకృతి విధ్వంసం సృష్టిస్తోంది. కులులోని జిల్లాలో కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి. భవనాలు పేకమేడలా కూలిపోయాయి. దీని వ‌ల్ల అనేక ఇండ్లు నేల‌మ‌ట్టం అయ్యాయి. తాజా ఘ‌ట‌న‌కు చెందిన వీడియో ఒక‌టి వైర‌ల్ అవుతోంది.  

హిమాచల్ విపత్తు: హిమాచల్ ప్రదేశ్‌లో ప్రకృతి విధ్వంసం సృష్టిస్తోంది. కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి. భవనాలు పేకమేడలా కూలిపోయాయి. ఈ తరుణంలో కులు జిల్లా నుండి ఓ హృదయ విదారక చిత్రం వెలువడింది. కులు జిల్లాలో ఏడు భవనాలు పేకమేడలా కూలిపోయింది. ఈ విధ్వంసకర దృశ్యాన్ని చూసినవారంతా నివ్వెరపోయారు.

అయితే.. ఈ భవనాలు అసురక్షితమని ఇప్పటికే ఖాళీ చేయడం ఉపశమనం కలిగించే విషయం. ఈ కారణంగా.. ఈ సంఘటనలో ఎటువంటి నష్టం జరగలేదు, కానీ ఈ వీడియో అందరినీ భయపెడుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సమాచారం ప్రకారం.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కోఆపరేటివ్ బ్యాంక్ ఈ భవనాల్లో పని చేసేవి. అయితే.. గతంలో కురిసిన వర్షాల కారణంగా.. భవనం అప్పటికే ప్రమాదకరంగా మారింది. దీంతో  ఆ భవనాలను ఖాళీ చేశారు. జిల్లా కులు జూలై, ఆగస్టు నెలల్లో భారీ వర్షపాతం నమోదైంది. ఈ వర్షం ఇక్కడ విధ్వంసం సృష్టించింది. ఈ సంఘటన కులు జిల్లాలోని బస్టాండ్ సమీపంలో ఉదయం 9:15 గంటలకు జరిగింది.

ఐదు రోజుల క్రితం భవనంలో పగుళ్లు వచ్చాయని అని ఎస్‌డిఎం నరేష్ వర్మ తెలిపారు. దీంతో వారిని ఖాళీ చేయించారు. భవనం కుప్పకూలడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడం ఊరటనిచ్చే అంశం. చాలా భవనాలు కూలిపోయాయని, ఒక భవనం ఇంకా ప్రమాదంలో ఉందని చెప్పారు. పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఘటనా స్థలంలో పోలీసు సిబ్బందిని కూడా మోహరించారు. ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

PREV
click me!

Recommended Stories

యువతకు బంపరాఫర్ ... 2026లో లక్షన్నర ప్రభుత్వ కొలువులు
భారత్–ఒమన్ వ్యాపార వేదికలో మోదీ కీలక వ్యాఖ్యలు | India–Oman Business Forum | Asianet News Telugu