మధురైలోని బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఐదుగురు మృతి

Published : Nov 10, 2022, 03:21 PM ISTUpdated : Nov 10, 2022, 03:37 PM IST
మధురైలోని బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఐదుగురు మృతి

సారాంశం

తమిళనాడులోని ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మధురై జిల్లా తిరుమంగళం సమీపంలోని అఖుసిరై గ్రామంలో బాణాసంచా ఫ్యాక్టరీలో గురువారం పేలుడు సంభవించింది. 

తమిళనాడులోని ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మధురై జిల్లా తిరుమంగళం సమీపంలోని అఖుసిరై గ్రామంలో బాణాసంచా ఫ్యాక్టరీలో గురువారం పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. మరికొందరు గాయపడగా వారిని ఆస్పత్రికి తరలించారు. బాణసంచా కర్మాగారంలో పేలుడు సంభవించిన స్థలంలో ఉన్న 3 భవనాలు నేలమట్టమయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు  చేపట్టారు. పేలుడుకు గల కారణాలను ఆరా తీస్తున్నారు. 

మధురై జిల్లా ఉసిలంబట్టి సమీపంలోని బాణాసంచా ఫ్యాక్టరీలో ఈరోజు పేలుడు సంభవించిందని మదురై ఎస్పీ ధృవీకరించారు. ప్రైవేట్ బాణాసంచా ఫ్యాక్టరీలో  ప్రమాదం చోటుచేసుకుందని, ఐదుగురు మరణించారని చెప్పారు.  అయితే ప్రమాదంలో ఎలా జరిగింది, ఎంత మంది గాయపడ్డారు.. వంటి ఇతర వివరాలను మాత్రం అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

Top 10 Banks : ఇండియాలో అతిపెద్ద బ్యాంక్ ఏదో తెలుసా..? ఇన్ని లక్షల కోట్లా..!
Top 10 Politicians : దేశంలో రిచ్చెస్ట్ ఎమ్మెల్యే ఎవరు..? టాప్ 10 లో ఒకే ఒక్క తెలుగు మహిళ