అరెస్టు నుంచి పారిపోతూ సెక్యూరిటీ గార్డును కారుతో గుద్దేసిన అత్యాచార నిందితుడు..వీడియో వైరల్...

By SumaBala BukkaFirst Published Nov 10, 2022, 2:06 PM IST
Highlights

అరెస్ట్ నుంచి పారిపోతూ ఓ వ్యక్తి సెక్యూరిటీ గార్డు మీదికి కారును ఎక్కించాడు. దీంతో మరో కేసులో ఇరుక్కున్నాడు. ఈ ఘటన నోయిడాలో జరిగింది. 

నోయిడా : అత్యాచారం కేసులో నిందితుడైన ఓ వ్యక్తి మంగళవారం అరెస్టును తప్పించుకునేందుకు ప్రయత్నిస్తూ.. ఓ వ్యక్తిని కారుతో ఢీ కొట్టాడు. ఈ ఘటన నోయిడాలో చోటు చేసుకుంది. ఓ కంపెనీలో జనరల్ మేనేజర్ ఒకరు రేప్ కేసులో నిందితుడు. అతడిమీద ఆరోపణలు రావడంతో పోలీసులు అరెస్ట్ చేయడానికి వెళ్లారు. వారినుంచి తప్పించుకోవడానికి తన కారులో పారిపోతూ హౌసింగ్ సొసైటీ గేటు వద్ద ఉన్న సెక్యూరిటీ గార్డును కారుతో ఢీకొట్టాడు. ఈ ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది.

అతని పేరు నీరజ్ సింగ్. ఓ ప్రైవేట్ కంపెనీలో జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. అతని సహోద్యోగి ఒకరు తనపై నీరజ్ సింగ్ అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా నోయిడా పోలీసులు సింగ్‌ను అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. కేసు నమోదు చేసినప్పటి నుంచి సింగ్ కనిపించకుండా పోయాడని ఓ పోలీసు అధికారి తెలిపారు. మంగళవారం సాయంత్రం, సెక్టార్ 120లోని అమ్రపాలి జోడియాక్ సొసైటీలోని తన ఇంట్లో సింగ్ ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. పోలీసుల రాకను పసిగట్టిన సింగ్ పారిపోయేందుకు ప్రయత్నించాడు.

ఈ డాక్టర్ ఓ అర్జున్ రెడ్డి.. తప్పతాగి మహిళా పేషంట్ ను చితగ్గొట్టి.. సస్పెండై...

సీసీటీవీ ఫుటేజీలో, సింగ్ కారు అండర్‌గ్రౌండ్ పార్కింగ్ నుండి బయటకు వస్తున్నట్టు కనిపించింది. అలా వచ్చే క్రమంలో అతివేగంతో డ్రైవ్ చేశాడు. అలా ఆ కారు గేటు వద్ద ఉన్న సెక్యూరిటీ గార్డుపైకి దూసుకెళ్లింది. మరో క్లిప్ లో కారులో పారిపోతున్న అతడిని ఆపడానికి సెక్యూరిటీ గార్డులు, పోలీసులు అతడిని రౌండ్ చేయడానికి ప్రయత్నిస్తుంటే.. కారుతో కొట్టి ఓ సెక్యూరిటీ గార్డును కింద పడేయడం కనిపిస్తుంది. ఆ తరువాత మరో సెక్యూరిటీ గార్డు మీదికి వాహనం ఎక్కించి.. అక్కడినుంచి తప్పించుకున్నాడు.

ఈ ఘటనలో అశోక్ మావి అనే సెక్యూరిటీ గార్డు భుజం, కాళ్లపై గాయాలైనట్లు సమాచారం. అతని ఫిర్యాదుపై, సింగ్‌పై భారత శిక్షాస్మృతిలోని సెక్షన్లు 279 (ర్యాష్ డ్రైవింగ్), 427 (నష్టం కలిగించడం), 338 (తీవ్రమైన గాయం లేదా ప్రాణహాని) కింద బుధవారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.  

click me!