మనిషి రూపంలో మేకపిల్ల: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియోలు

Published : Apr 09, 2021, 11:17 AM ISTUpdated : Apr 09, 2021, 02:39 PM IST
మనిషి రూపంలో మేకపిల్ల: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియోలు

సారాంశం

ప్రపంచంలో ఏం జరిగినా క్షణాల్లో తెలిసిపోతోంది. స్మార్ట్ ఫోన్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత  ప్రపంచంలో చీమ చిటుక్కొన్నా కూడ తెలిసిపోతోంది. 

గాంధీనగర్: ప్రపంచంలో ఏం జరిగినా క్షణాల్లో తెలిసిపోతోంది. స్మార్ట్ ఫోన్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత  ప్రపంచంలో చీమ చిటుక్కొన్నా కూడ తెలిసిపోతోంది.  అయితే  పాత ఘటనలు కూడ సోషల్ మీడియాలో  ఇంకా వైరల్ గా మారుతున్న ఘటనలు కూడ అప్పుడప్పుడూ చూస్తాం. గుజరాత్ రాష్ట్రంలో చోటు చేసుకొన్న ఓ ఘటన ప్రస్తుతం మరోసారి సోషల్ మీడియాలో మరోసారి చక్కర్లు కొడుతోంది.

మనిషి ముఖంతో ఓ మేకపిల్ల వీడియో,ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.గుజరాత్ రాష్ట్రంలోని సెల్తీపద గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకొంది.నాలుగు కాళ్లు, మేక తరహలో చెవులు కలిగి ఉంది. మిగిలిన ఆకారం అంతా మనిషి రూపంలో ఉంది. మేకకు తోక కూడ లేదు.  అయితే ఈ మేకపిల్ల పుట్టిన కొద్ది క్షణాలకే మరణించింది.

ఈ ఘటన 2020లో చోటు చేసుకొంది. ఆ సమయంలో కూడ ఈ వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అవే ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాను కుదిపివేస్తున్నాయి.దేవుడు మేక రూపంలో జన్మనిచ్చారనే కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వీడియోలపై నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఈ వీడియోలు, ఫోటోలను నెట్టింట్లో షేర్ చేస్తున్నారు.  ఈ వీడియోలను చూసేందుకు ఎక్కువమంది ఆసక్తిని చూపుతున్నారు.
 

PREV
click me!

Recommended Stories

India Skills Report 2026: ఉద్యోగాలు సాధించడంలో ఆ రాష్ట్ర యువతే టాప్.. తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటి?
పెద్ద మనసుతో ఆదుకున్నారు..అందులో తప్పేంటీ? | Government jobs for Karur victims | CM Vijay