న్యూఢిల్లీలో దారుణం: దుండగుల కాల్పుల్లో ఒకరు మృతి

Published : Aug 30, 2023, 10:02 AM ISTUpdated : Aug 30, 2023, 10:06 AM IST
న్యూఢిల్లీలో  దారుణం: దుండగుల కాల్పుల్లో ఒకరు మృతి

సారాంశం

న్యూఢిల్లీలో  బుధవారంనాడు తెల్లవారుజామున జరిగిన  కాల్పుల్లో ఒకరు మృతి చెందారు. మరోకరు గాయపడ్డారు.

న్యూఢిల్లీ: న్యూఢిల్లీలో బుధవారంనాడు జరిగిన కాల్పుల్లో ఒకరు మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు.న్యూఢిల్లీలోని భజన్‌పుర ప్రాంతంలో  ఈ ఘటన చోటు చేసుకుంది.  కాల్పుల్లో మృతి చెందిన వ్యక్తిని  హర్‌ప్రీత్  గిల్ గా గుర్తించారు. దుండగులు కాల్పులకు దిగిన వెంటనే స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు. అయితే  ఆసుపత్రిలో వైద్యులు పరీక్షించి అతను మృతి చెందినట్టుగా ప్రకటించారు.

ఈ ఘటనలో గాయపడిన వ్యక్తిని  గోవింద్ సింగ్ గా గుర్తించారు. అతడికి లోక్‌నాయక్ జయప్రకాష్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.మోటార్ బైక్ పై  ఈ ఇద్దరు వెళ్తున్న సమయంలో దుండగుడు అడ్డగించి కాల్పులు జరిపినట్టుగా  పోలీసులు చెబుతున్నారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు  చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

సంక్రాంతికి కిచిడీ మేళా.. ఈ ఆలయంలో విచిత్రమైన ఆచారం
Gold Rate : గూగుల్, న్యూస్ ధరలు కాదు.. రియల్ టైమ్ బంగారం రేటు కచ్చితంగా తెలుసుకోవడం ఎలాగంటే..