మావోల కుట్ర భగ్నం..ఏడుగురు అరెస్ట్

By Nagaraju TFirst Published Sep 24, 2018, 2:26 PM IST
Highlights

ఏవోబీలో మావోయిస్టులు మరోమారు భారీ పేలుళ్లకు కుట్ర పన్నారు. అరకు టీడీపీ నేతలపై కాల్పులు జరిగిన 24 గంటలు గడవకముందే మరో భారీ పేలుళ్లకు సిద్దపడ్డారు. ప్రజాప్రతినిధులే లక్ష్యంగా ఛత్తీస్‌గఢ్‌లో ఏర్పాటు చేసిన మందుపాతర్లను పోలీసులు భగ్నం చేశారు. 

ఛత్తీస్ ఘడ్ : ఏవోబీలో మావోయిస్టులు మరోమారు భారీ పేలుళ్లకు కుట్ర పన్నారు. అరకు టీడీపీ నేతలపై కాల్పులు జరిగిన 24 గంటలు గడవకముందే మరో భారీ పేలుళ్లకు సిద్దపడ్డారు. ప్రజాప్రతినిధులే లక్ష్యంగా ఛత్తీస్‌గఢ్‌లో ఏర్పాటు చేసిన మందుపాతర్లను పోలీసులు భగ్నం చేశారు. ఘటన స్థలం నుంచి పైప్ బాంబో తోపాటు పలు పేలుడు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

ఆరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలపై మావోయిస్టుల దాడుల నేపథ్యంలో ఏవోబీ పరిసర ప్రాంతంలోని పోలీసులు అప్రమత్తమయ్యారు. ఏపీతో పాటు తెలంగాణ, ఒడిస్సా, చత్తీస్ ఘడ్ రాష్ట్రాలలో రెడ్ అలర్ట్ ప్రకటించడంతో కూంబింగ్ చేపట్టారు. మావోయిస్టుల ప్రాబల్య ప్రాంతాల్లో అదనపు బలగాలతో కూంబింగ్ నిర్వహిస్తున్నారు పోలీసులు. 

ఈ నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యంలో కూంబింగ్‌ చేపట్టిన బలగాలు మందుపాతర్లను గుర్తించారు. నారాయణపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని డంప్‌ను గుర్తించిన పోలీసులు భగ్నం చేశారు. అయితే  ఈ పేలుళ్ల కుట్రకు సంబంధించి ఏడుగురు మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుంచి భారీ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. 

కాగా టీడీపీ నేతల హత్య అనంతరం ఛత్తీస్‌గఢ్‌, ఒరిస్సా, తెలంగాణ, ఏపీ ప్రాంతాల్లో పోలీసులు హై అలర్ట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. మవోయిస్టులు ప్రాబల్య ప్రాంతాల్లో అదనపు బలగాలతో కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో గ్రేహౌండ్స్‌ దళాల ఆధ్వర్యంలో పోలీసులు జల్లడపడుతున్నారు.

click me!