నదిలో కొట్టుకుపోయిన పర్యాటకుల బస్సు..(వీడియో)

By ramya neerukondaFirst Published Sep 24, 2018, 2:21 PM IST
Highlights

మనాలీలో బియాస్ నది పక్కన పార్క్ చేసిన ఓ టూరిస్టు బస్సు అకస్మాత్తుగా పెరిగిన వరదలో కొట్టుకుపోయింది.

హిమాచల్ ప్రదేశ్  లోని మనాలీలో టూరిస్ట్ లకు ఊహించని షాక్ తగిలింది. మనాలీలోని బియాస్ నదిలో పర్యాటకుల బస్సు కొట్టుకుపోయింది. భారీ వర్షాలు కారణంగా కులు, మనాలీలోని బియాస్ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. 24 గంటల వ్యవధిలో మానాలిలో 127.4 మిమీల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీంతో కొండచరియలు సైతం విరిగిపడుతున్నాయి. 

 

: Vacant bus gets washed away into the flooded Beas river in Manali. pic.twitter.com/GMV2nqR2jX

— ANI (@ANI)

భారీ వర్షాల వల్ల మండీలోని బీయాస్ నది చండీగడ్ - మనాలీ జాతీయ రహదారిని ముంచెత్తింది. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. మనాలీలో బియాస్ నది పక్కన పార్క్ చేసిన ఓ టూరిస్టు బస్సు అకస్మాత్తుగా పెరిగిన వరదలో కొట్టుకుపోయింది. ఆ సమయంలో బస్సులో ప్రయాణికులు ఉన్నారా లేదా అనే సమాచారం ఇంకా తెలియరాలేదు. బస్సు నదిలో కొట్టుకుపోతుండగా ఎవరో తీసిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

click me!