ఇండియాలో ఎయిర్‌పోర్ట్‌ లేని రాష్ట్రం.. నేడు సాకారమైన దశాబ్ధాల కల

By sivanagaprasad kodatiFirst Published Sep 24, 2018, 1:11 PM IST
Highlights

అభివృద్ధిలో శరవేగంగా దూసుకెళ్తున్న భారత్‌లో ఒక రాష్ట్రంలో అసలు విమానాశ్రయం లేదంటే నమ్ముతారా..? కానీ అది నిన్నటి వరకు మాత్రమే.. ఆ రాష్ట్రం మరేదో కాదు.. సిక్కిం. ఈశాన్య రాష్ట్రమైన సిక్కింలో తొలి విమానాశ్రయాన్ని ఇవాళ ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు.

పూర్తిగా పర్వత ప్రాంతాలతో నిండివుండే సిక్కింలో విమాశ్రయ నిర్మాణం ఇంత వరకు సాధ్యపడలేదు.. తమ రాష్ట్రానికి ఎయిర్‌పోర్ట్ కావాలని ఆ రాష్ట్ర ప్రజలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నాటి యూపీఏ ప్రభుత్వం 201 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.605 కోట్ల వ్యయంతో పాక్యాంగ్ విమానాశ్రయానికి శంకుస్థాపన చేసింది.

పర్వతాలను తొలిచి అనేక క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని విమానాశ్రయ నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఇది దేశంలో వందవ విమానాశ్రయం.  దీని ప్రారంభం వల్ల రాష్ట్రానికి దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానం కలుగుతుంది.. అంతేకాకుండా పర్యాటక రంగం అభివృద్ధి చెందే అవకాశాలు పెరుగుతాయి. అక్టోబర్ 4 నుంచి పాక్యాంగ్ విమానాశ్రయం నుంచి వాణిజ్య విమానాలు నడవనున్నాయి. 

click me!