అప్పటిదాకా పార్టీ నేతలతో కలిసి ప్రచారం.. సడెన్‌గా బీజేపీలో చేరిన తృణమూల్ నేత, ఉపఎన్నికల వేళ టీఎంసీకి షాక్

Siva Kodati |  
Published : Sep 03, 2023, 02:56 PM IST
అప్పటిదాకా పార్టీ నేతలతో కలిసి ప్రచారం.. సడెన్‌గా బీజేపీలో చేరిన తృణమూల్ నేత, ఉపఎన్నికల వేళ టీఎంసీకి షాక్

సారాంశం

తృణమూల్ కాంగ్రెస్‌కు ఆ పార్టీ సినియర్ నేత ధుప్గురి మితాలీ రాయ్ ఆ పార్టీకి షాకిచ్చారు. ధూప్‌గిరి ఉపఎన్నికలకు కేవలం రెండు రోజుల ముందు ఆమె బీజేపీలో చేరారు. ఉత్తర బెంగాల్‌లోని కీలక నేతల్లో మితాలీ రాయ్ ఒకరు.   

తృణమూల్ కాంగ్రెస్‌కు ఆ పార్టీ సినియర్ నేత ధుప్గురి మితాలీ రాయ్ ఆ పార్టీకి షాకిచ్చారు. ఉత్తర బెంగాల్‌లో కీలకమైన ధూప్‌గిరి ఉపఎన్నికలకు కేవలం రెండు రోజుల ముందు ఆమె బీజేపీలో చేరారు. రాయ్ 2016 అసెంబ్లీ ఎన్నికల్లో ధూప్‌గురి స్థానం నుంచి టీఎంసీ టికెట్‌పై గెలిచారు. అయితే 2021 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి బిష్ణుపాద రాయ్ చేతిలో ఓడిపోయారు. రెండు రోజుల క్రితం ఆమె ధూప్‌గురి ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న టీఎంసీ అభ్యర్ధి తరపున ప్రచారం చేయడం కనిపించింది. ఉత్తర బెంగాల్‌లోని కీలక నేతల్లో మితాలీ రాయ్ ఒకరు. 

మిథాలీ రాయ్ ఇవాళ బీజేపీలో చేరినప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ కూడా వున్నారు. అనంతరం సుకాంత మీడియాతో మాట్లాడుతూ.. యోగా చేయడం ద్వారా గడిచిన ఏడాది కాలంలో మితాలీ 24 కిలోల బరువు తగ్గారని ప్రశంసించారు. ఆమెకు ప్రధాని నరేంద్ర మోడీ స్పూర్తి అని  సుకాంత చెప్పారు. దుబ్గురి ఎన్నికల్లో టీఎంసీ తరపున రాష్ట్ర మంత్రి అరూప్ బిశ్వాస్‌తో కలిసి మితాలీ రాయ్ ప్రచారం చేశారు. దీనికి ముందు ఆమె బిశ్వాస్‌తో సమావేశమయ్యారు. నివేదిక ప్రకారం 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత అగ్ర నాయకత్వం ఆమెను అంతగా పట్టించుకోలేదు. టీఎంసీ హైకమాండ్‌పై ఆమె తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. అయితే మితాలీ రాయ్ పార్టీ మారడంపై టీఎంసీ ఇంకా స్పందించలేదు. ధూప్‌గురిలో సెప్టెంబర్ 5న ఉప ఎన్నిక జరగనుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu
PM Narendra Modi: దేశం గర్వపడేలా.. సౌదీ రాజులు దిగివచ్చి మోదీకి స్వాగతం| Asianet News Telugu