ఆ ఆలోచన రాష్ట్రాలపై దాడి: వన్ నేషన్, వన్ ఎలక్షన్ పై రాహుల్ గాంధీ

Published : Sep 03, 2023, 02:42 PM ISTUpdated : Sep 03, 2023, 02:46 PM IST
 ఆ ఆలోచన  రాష్ట్రాలపై దాడి: వన్ నేషన్, వన్ ఎలక్షన్ పై రాహుల్ గాంధీ

సారాంశం

జమిలి ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు.  ఈ ఆలోచనను ఆయన తప్పుబట్టారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై కేంద్ర ప్రభుత్వం  కమిటీని ఏర్పాటు చేసిన తర్వాత రాహుల్ గాంధీ స్పందించారు.

న్యూఢిల్లీ: ఒకే దేశం, ఒకే ఎన్నికలు అనే ఆలోచన భారత సమాఖ్య స్ఫూర్తికి  విరుద్దమని  కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ  అభిప్రాయపడ్డారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై కేంద్ర ప్రభుత్వం  రెండు రోజుల క్రితం  రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది.ఈ విషయమై  రాహుల్ గాంధీ   సోషల్ మీడియా వేదికగా  స్పందించారు.   భారత్ అంటే  రాష్ట్రాల యూనియన్ అనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు.  ఒకే దేశం, ఒకే  ఎన్నికలు అనే ఆలోచన  రాష్ట్రాల యూనియన్ పై. రాష్ట్రాలపై దాడిగా ఆయన  పేర్కొన్నారు. ఒకే దేశం, ఒకే ఎన్నికలు అంశాన్ని పరిశీలించేందుకు  ఏర్పాటు చేసే కమిటీలో  భాగస్వామ్యం కావాలని కేంద్రం చేసిన  ఆఫర్ ను కాంగ్రెస్ పార్టీ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి  శనివారం నాడు తిరస్కరించిన విషయం తెలిసిందే. రాజ్యసభలో  విపక్ష నేత మల్లికార్జున ఖర్గేను  ఈ కమిటీ నుండి తప్పించడంపై చౌదరి  ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ కమిటీలో  గులాం నబీ ఆజాద్ కు చోటు  కల్పించిన విషయం తెలిసిందే.

 

ఈ కమిటీలో అమిత్ షా, గులాం నబీ ఆజాద్,  15వ, ఆర్ధిక సంఘం  కమిషన్ చైర్మెన్ ఎన్ కే సింగ్,  లోక్ సభ మాజీ సెక్రటరీ జనరల్  సుభాష్ కశ్యప్,  సీనియర్ అడ్వకేట్  హరీష్ సాల్వే, మాజీ విజిలెన్స్ కమిషనర్  సంజయ్ కొఠారిని నియమించింది  ప్రభుత్వం.  ఇదిలా ఉంటే  ఈ కమిటీ నియామకంపై  కాంగ్రెస్ నేత జైరామ్ రమేష్ కూడ  స్పందించారు.  కేంద్రం తీరును తీవ్రంగా తప్పుబట్టారు.  

also read:వన్ నేషన్ - వన్ ఎలక్షన్‌పై కమిటీ ఏర్పాటు : ఛైర్మన్‌గా మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్.. సభ్యులుగా అమిత్ షా, అధిర్

ఈ నెల 18వ తేదీ నుండి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్నాయి.ఈ సమావేశాల్లో వన్ నేషన్ ,వన్ ఎలక్షన్ కు సంబంధించిన బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టే అవకాశం ఉందనే  ప్రచారం కూడ లేకపోలేదు. వన్ నేషన్, వన్ ఎలక్షన్  ప్రక్రియను  విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి.జమిలి ఎన్నికలను  ఇండియా కూటమి వ్యతిరేకిస్తుంది.   ఈ విషయమై అన్ని పార్టీలతో  కూడ  కేంద్రం చర్చించాల్సి ఉంది.  జమిలి ఎన్నికలపై  రాజకీయ పార్టీల నుండి ఏకాభిప్రాయం రావాల్సిన అవసరం ఉంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu
PM Narendra Modi: దేశం గర్వపడేలా.. సౌదీ రాజులు దిగివచ్చి మోదీకి స్వాగతం| Asianet News Telugu