వ్యాక్సిన్ వార్: భారత్ బయోటెక్, సీరంల మధ్య వివాదానికి చెక్

By Siva KodatiFirst Published Jan 5, 2021, 6:19 PM IST
Highlights

కరోనా కట్టడి కోసం హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్, సీరం ఇనిస్టిట్యూట్ రూపొందించిన కోవిషీల్డ్ వ్యాక్సిన్లకు డీసీజీఐ అనుమతి ఇవ్వడంపై వివాదం చెలరేగింది

కరోనా కట్టడి కోసం హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్, సీరం ఇనిస్టిట్యూట్ రూపొందించిన కోవిషీల్డ్ వ్యాక్సిన్లకు డీసీజీఐ అనుమతి ఇవ్వడంపై వివాదం చెలరేగింది.

మూడు దశల ట్రయల్స్‌కు సంబంధించి ఎలాంటి డేటాలను సమర్పించకుండానే భారత్ బయోటెక్ కనుగొన్న కొవాగ్జిన్‌కు ఎలా అనుమతి మంజూరు చేస్తారంటూ కొందరు శాస్త్రవేత్తలతో పాటు ప్రతిపక్ష పార్టీలు విమర్శించాయి.

సీరం ఇన్‌స్టిట్యూట్ కనుగొన్న కొవిషీల్డ్ వ్యాక్సిన్‌కు చాలా మంది తప్పుబట్టారు. దీంతో భారత్ బయోటెక్- సీరం ఇన్‌స్టిట్యూట్ మధ్య వివాదం చెలరేగింది. అయితే చివరికి కొవాగ్జిన్, కొవిషీల్డ్‌ మధ్య సయోధ్య కుదిరింది.

గత వారం రెండు సంస్థల మధ్య తలెత్తిన విబేధాలు సమసిపోయాయి. కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి, ఉత్పత్తి కోసం కలిసి పనిచేస్తామని ఈ రెండు సంస్థలు చెప్పాయి. ఇక వ్యాక్సిన్ పంపిణీ కోసం టీకా నిల్వ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 

click me!