మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు బోల్తా పడటంతో ఇద్దరు మృతి.. 30 మందికి గాయాలు

Published : Jan 19, 2023, 12:39 PM IST
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు బోల్తా పడటంతో ఇద్దరు మృతి.. 30 మందికి గాయాలు

సారాంశం

మహారాష్ట్రలో సింధుదుర్గ్ జిల్లాలో ఓ బస్సు బోల్తా పడటంతో ఇద్దరు మరణించారు. 30 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు హాస్పిటల్ కు తరలించారు. 

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సింధుదుర్గ్ జిల్లాలో ఓ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో 30 మంది గాయాలు అయ్యాయి. రాష్ట్ర రాజధాని ముంబైకి 480 కిలో మీటర్ల దూరంలో ఉన్న కంకవ్లీలోని గాడ్ నది వంతెన సమీపంలోని ఓ మలుపు వద్ద డ్రైవర్ కంట్రోల్ కోల్పోయాడు. దీంతో బస్సు బోల్తా పడింది.

లఖింపూర్ ఖేరీ హింసాకాండ: సుప్రీం కోర్టులో కేంద్ర మంత్రి కుమారుడి బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకించిన యూపీ సర్కార్

ఈ ఘటన ఉదయం 5.30 గంటలకు చోటు చేసుకుందని ఓ అధికారి తెలిపారు. ఈ ప్రమాదానికి గురైన లగ్జరీ బస్సు 36 మంది ప్రయాణికులతో పూణె నుంచి గోవా వెళ్తోందని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కంకవ్లిలోని సివిల్ ఆసుపత్రికి తరలించారు.

అది ఫేక్.. అసలు ఆమె మీద అత్యాచారమే జరగలేదు.. మెడికల్ రిపోర్టులో షాకింగ్ విషయాలు...

ముంబై-గోవా హైవేపై కూడా ఇలాంటి ప్రమాదమే చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ చిన్నారితో పాటు 9 మంది మరణించారు. కారు, ట్రక్కు ఎదురెదురుగా వేగంగా ఢీకొనడంతో కారులో ఉన్న వారందరూ మరణించారు. అదే సమయంలో లారీలో కూర్చున్న వారు కూడా ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్ర గాయాలతో ప్రాణాలతో బయపడ్డారు. 

PREV
click me!

Recommended Stories

Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం
PM Surya Ghar Scheme : ఇలా చేశారో విద్యుత్ ఛార్జీలుండవు.. డబ్బులు సేవ్