
ప్రముఖ సీనియర్ సినీ దర్శకుడు అనుమానాస్పద స్థితిలో మరణించారు. మలయాళ దర్శకుడు అయిన ప్రకాశ్ కోలేరి (65) మంగళవారం కేరళలోని వయనాడ్ లోని తన నివాసంలో చనిపోయి కనిపించారు. 1987లో విడుదలైన తొలి చిత్రం 'మిళియితలిల్ కన్నీరుమయి' ద్వారా ఆయన మలయాళ సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు.
భర్తను స్టేషన్ లో బంధించి.. భార్యపై కానిస్టేబుల్ లైంగిక దాడి.. దాచేపల్లిలో ఘటన
2013లో వచ్చిన 'పట్టుపుస్తకం' ఆయన చివరి చిత్రంగా నిలిచింది. కోలేరి 'అవన్ ఆనందపద్మనాభన్'; 'వరుం వారతిరికిల్లా' వంటి సినిమాలకు స్క్రిప్టు రాసి, దర్శకత్వం వహించారు. మరో నాలుగు సినిమాలకు కూడా స్క్రిప్టులు రాశారు.
కాగా.. వయనాడ్ లోని తన ఇంట్లో ఒంటరిగా ఉంటున్న ఆయన గత రెండు రోజులుగా కనిపించకుండా పోయారు. బంధువులకు అనుమానం రావడంతో ఇంటికి వచ్చారు. ఇంటి తలుపులు మూసి ఉండటంతో వాటిని పగులగొట్టారు. లోపల ఆయన మృతి చెంది కనిపించారు. ఆయన మరణంతో మలయాళ సినీ పరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది.