2024 ఎన్నికల్లో రాహుల్ గాంధీయే ప్రతిపక్ష ప్రధాని అభ్యర్థి - కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్

By team teluguFirst Published Dec 31, 2022, 1:14 PM IST
Highlights

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతిపక్షాల తరుఫున రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థిగా ఉంటారని మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కమల్ నాథ్ అన్నారు. ప్రపంచంలో ఏ నాయకుడు కూడా ఇన్ని కిలో మీటర్లు పాదయాత్ర చేపట్టలేదని కొనియాడారు. 

2024 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ఎంపిక చేస్తామని ఆ పార్టీ సీనియర్ నేత కమల్ నాథ్ ప్రకటించారు. భారత్ జోడో యాత్రకు నాయకత్వం వహిస్తున్నందుకు రాహుల్ గాంధీపై ప్రశంసలు కురిపించిన కమల్ నాథ్.. ఆయన అధికారం కోసం రాజకీయాలు చేయడం లేదని, దేశంలోని సాధారణ ప్రజల కోసం రాజకీయాలు చేస్తున్నారని నొక్కి చెప్పారు.

న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్: డ్రింక్ అండ్ డ్రైవింగ్ తనిఖీల కోసం 18,000 మంది ఢిల్లీ పోలీసులు

2024 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుఫున మాత్రమే ప్రధాని అభ్యర్థి కాదని, ప్రతిపక్షాల తరఫున కూడా ఆయనే అభ్యర్థిగా ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచ చరిత్రలో ఇంత సుదీర్ఘమైన పాదయాత్ర ఎవరూ చేపట్టలేదని కమల్ నాథ్ అన్నారు. గాంధీ కుటుంబం తప్ప మరే కుటుంబం దేశం కోసం ఇన్ని త్యాగాలు చేయలేదని అన్నారు. రాహుల్ గాంధీ అధికారం కోసం రాజకీయాలు చేయడం లేదని, ఎవరినైనా అధికారంలో కూర్చోబెట్టే దేశ ప్రజల కోసమే రాజకీయాలు చేస్తారని ఆయన తెలిపారు. 

కాగా.. 2024 ఎన్నికలకు రాహుల్ గాంధీ అభ్యర్థిత్వాన్ని ఎప్పటి వరకు సమర్థించి ఏకైక కాంగ్రెస్ నాయకుడు కమల్ నాథ్ కావడం గమనార్హం. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా.. భవిష్యత్తులో జ్యోతిరాదిత్య సింధియా తిరిగి పార్టీలోకి తీసుకుంటారా అనే ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. ‘‘నేను ఏ వ్యక్తి గురించి మాట్లాడను. కానీ పార్టీకి ద్రోహం చేసి, పార్టీ కార్యకర్తల విశ్వాసాన్ని ఉల్లంఘించిన ద్రోహులకు మా సంస్థలో స్థానం లేదు.’’ అని అన్నారు.

బట్టలు విప్పేసుకుని మహిళ వెంటపడి.. కోరిక తీర్చాలంటూ.. మహారాష్ట్రలో కామాంధుడి వీరంగం..

మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరిస్తామని తెలిపారు. బీజేపీ తమ ముఖ్యమంత్రిగా ఎవరినైనా ప్రకటించవచ్చని, కానీ మధ్యప్రదేశ్ ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్‌కు ఓటు వేయాలని నిర్ణయించున్నారని జోస్యం చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో సంస్థాగత మార్పులను అమలు చేస్తామని ఆయన పేర్కొన్నారు.

కాగా.. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర దాదాపు 3,000 కిలోమీటర్లు ప్రయాణించింది.  ప్రస్తుతం తొమ్మిది రోజుల శీతాకాల విరామంలో ఢిల్లీలో ఆగిపోయింది. జనవరి 3న ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోకి ప్రవేశిస్తూ పాదయాత్ర తిరిగి ప్రారంభమవుతుంది.

త్రిపుర అసెంబ్లీ ఎన్నిక‌లు: జ‌న‌వ‌రి 5న బీజేపీ రాష్ట్రవ్యాప్త ర‌థ‌యాత్ర‌ను ప్రారంభించ‌నున్న అమిత్ షా

ఇదిలా ఉండగా.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు పలు పార్టీల నాయకులు ఇప్పటికే కూటమిలను ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. అందులో భాగంగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బీహార్ సీఎం నితీష్ కుమార్, తెలంగాణ సీఎం కేసీఆర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వంటి నాయకులు ఇప్పటికే ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ కూటమికి ఎవరు నాయకత్వం వహించాలనే విషయంపై ఇప్పటి వరకు ఒక క్లారిటీ రాలేదు. కానీ మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయిన కమల్ నాథ్ రాహుల్ గాంధీ పేరును తాజాగా ప్రతిపాదించడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. 

click me!