
న్యూఢిల్లీ: న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. కొందరు యువకులు ఇప్పటికే తమ ఎంజాయ్‌మెంట్ ప్రారంభించారు. అందుకు తగిన చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధం అయ్యాయి. యాక్షన్ ప్లాన్‌ను అమలు చేస్తున్నాయి. ట్రాఫిక్ వయలేషన్స్, డ్రింక్ అండ్ డ్రైవ్, ఘర్షణలు, పబ్లిక్ ప్లేస్‌లో న్యూసెన్స్ వంటి అంశాలపై పోలీసులు ప్రధానంగా ఫోకస్ పెట్టనున్నారు. ఇందులో భాగంగానే ఢిల్లీ పోలీసులు డ్రింక్ అండ్ డ్రైవింగ్ పై ప్రత్యేక నజర్ పెట్టారు. ఢిల్లీ వ్యాప్తంగా ఈ యాక్షన్స్ కోసం 18,000 మంది పోలీసులు రంగంలోకి దిగుతుండటం గమనార్హం. సిటీలో డ్రంక్ అండ్ డ్రైవింగ్ స్పాట్‌లుగా కనీసంగా 125 లొకేషన్‌లను గుర్తించారు.
కన్నాట్ ప్లేస్‌లోకి రాత్రి 8 గంటల తర్వాత ప్రయాణాలను నిషేధించారు. అనుమతి ఉన్నవారికి మాత్రమే లోనికి వెళ్లనిస్తారని అధికారులు తెలిపారు. లా అండ్ ఆర్డర్ స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీసు దీపేంద్ర పాఠక్ దీనిపై మాట్లాడుతూ, ‘మేం సరిపడా భద్రతా ఏర్పాట్లు చేశాం. సుమారు 16,500 సిబ్బంది నగరమంతటా శనివారం మోహరించాం. న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ నేపథ్యంలో ఈ మోహరింపులు చేపట్టాం. మరో 20 కంపెనీల సిబ్బంది వేరే ఫోర్సెస్ నుంచి వేర్వేరు జిల్లాల్లో మోహరింపజేస్తాం’ అని పేర్కొన్నారు.
‘ఈ సారి సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉండే ఏరియాల్లో యాంటీ టెర్రర్ చర్యలు కూడా తీసుకుంటాం. స్థానిక పోలీసులు ఎప్పటికప్పుడు స్పెషల్ సెల్‌తో సమన్వయంలో ఉండి పరిస్థితులను రియల్ టైంలో పర్యవేక్షిస్తారు’ అని తెలిపారు. ముఖ్యంగా మహిళ రక్షణ తమ ప్రధాన అంశంగా ఉంటుందని, 2,500 మంది కంటే ఎక్కువగా మహిళా సిబ్బంది నగరంలో మోహరిస్తారని వివరించారు.
న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా 1,600 పికెట్లను తనిఖీల కోసం ఏర్పాట్లు చేస్తారని, 1,200 కంటే పైగా మొబైల్ పెట్రోలింగ్ వెహికిల్స్, 2,074 మోటార్‌బైక్ సేవలను వినియోగిస్తామని ఆయన తెలిపారు.
పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేపడతామని, సుమారు 1,850 మంది ట్రాఫిక్ పోలీసులు స్థానిక పోలీసులతో కలిసి పని చేస్తారని ట్రాఫిక్ స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీసు ఎస్ఎస్ యాదవ్ తెలిపారు.
అన్ని రకాల ట్రాఫిక్ వయలేషన్స్‌ను పర్యవేక్షించనున్నట్టు అధికారులు తెలిపారు. అలాగే, కరోనా జాగ్రత్తలపైనా కన్నేస్తామని వివరించారు.
గతేడాది న్యూ ఇయర్ సందర్భంగా మొత్తం 657 చాలాన్లను జారీ చేశామని, అందులో 36 చాలాన్లు డ్రంక్ అండ్ డ్రైవింగ్‌కు సంబంధించినవి.