గులాం నబీ ఆజాద్‌కి కరోనా: హోం క్వారంటైన్‌లో కాంగ్రెస్ నేత

By narsimha lode  |  First Published Oct 16, 2020, 3:48 PM IST

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.


కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.కరోనా సోకడంతో  తాను హోం క్వారంటైన్ లో ఉన్నట్టుగా ఆయన ప్రకటించారు.

కొన్ని రోజులుగా తనను కలిసిన వారంతా కోవిడ్ ప్రోటోకాల్ ను అనుసరించాలని ఆయన కోరారు. అంతేకాదు తనను కలిసినవారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అంతేకాదు హోం క్వారంటైన్ లో ఉండాలని ఆయన కోరారు.అహ్మద్ పటేల్, మోతిలాల్ వోరా, అభిషేక్ సింఘ్విలు గతంలో కరోనాకు గురై కోలుకొన్నారు.. 

Latest Videos

undefined

 

I have tested positive for COVID-19. I am in home quarantine. Those who came in contact with me in last few days may kindly follow the protocol.

— Ghulam Nabi Azad (@ghulamnazad)

ఆజాద్ రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత.ఇటీవల జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో ఆజాద్ సహా కొందరు సీనియర్లు వ్యవహరించిన తీరు ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. సంస్థాగతంగా పార్టీలోని అన్ని పదవులకు ఎన్నికలు నిర్వహించాలని ఆజాద్ డిమాండ్ చేశారు. 

కరోనాతో బీహార్ మంత్రి కపిల్ డియో కామత్ శుక్రవారం నాడు మరణించారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. కరోనా కేసుల సంఖ్యతో పాటు 

click me!