
హిందూ దేవుళ్ల ఫొటోలు ఉన్న పేపర్లలతో ఓ వ్యాపారి మాంసం విక్రయించాడు. ఈ విషయంపై ఫిర్యాదు రావడంతో పోలీసులు అతడి వద్దకు వెళ్లారు. అయితే అతడు పోలీసులపైనే దాడికి ప్రయత్నించాడు. దీంతో అతడిని అరెస్టు చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని సంభాల్ లో చోటు చేసుకుంది.
‘‘ నా పిల్లలు నా కళ్ల ముందే చనిపోయారు’’ - అసెంబ్లీలో కన్నీటిపర్యమంతమైన సీఎం ఏక్ నాథ్ షిండే
తాలిబ్ హుస్సేన్ తన దుకాణంలోని చికెన్‌ను హిందూ దేవీ, దేవతలు ఫొటోలు ఉన్న కాగితాలపై అమ్ముతున్నాడని, తమ మత భావాన్ని దెబ్బతీస్తున్నాడని కొందరు ఫిర్యాదు చేశారని పోలీసులు వార్తా సంస్థ పీటీఐకి తెలిపారు. దీంతో ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పారు.
ఓ పోలీసు బృందం తాలిబ్ హుస్సేన్ చికెన్ సెంటర్ కు చేరుకున్నప్పుడు, అతడు వారిని హత్య చేయాలనే ఉద్దేశ్యంతో కత్తితో దాడి చేశాడని ఎఫ్ఐఆర్ పేర్కొందని ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా తెలిపింది. నిందితుడిపై IPC సెక్షన్లు 153-A (మతం, జాతి, పుట్టిన ప్రదేశం, నివాసం ఆధారంగా వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం), 295-A (ఉద్దేశపూర్వకంగా, హానికరమైన చర్యలు, అవమానించడం ద్వారా ఏ వర్గానికి చెందిన మతపరమైన భావాలను కించపరిచే ఉద్దేశ్యం) 307 (హత్య ప్రయత్నం) కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.