సెల్పీ వీడియో తీసుకుంటూ యువకుడి ఆత్మహత్య

Published : Jul 07, 2018, 11:20 AM ISTUpdated : Jul 07, 2018, 11:25 AM IST
సెల్పీ వీడియో తీసుకుంటూ యువకుడి ఆత్మహత్య

సారాంశం

ఓ యువకుడు సెల్పీ వీడియో తీసుకుంటూ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది. రైలు పట్టాలపై పడుకుని తన మొబైల్ లో వీడియోను తీసుకుంటూ అత్యంత దారుణంగా బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ మారి సంచలనం సృష్టిస్తోంది.  

ఓ యువకుడు సెల్పీ వీడియో తీసుకుంటూ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది. రైలు పట్టాలపై పడుకుని తన మొబైల్ లో వీడియోను తీసుకుంటూ అత్యంత దారుణంగా బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ మారి సంచలనం సృష్టిస్తోంది.

ఈ విషాద సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే...జోద్ పూర్ సమీపంలోని సత్లాం ప్రాంతానికి చెందిన ముకేష్ చౌహాన్ ఐదేళ్లుగా ప్రేమిస్తోన్న ఓ యువతిని ఇటీవలే పెళ్లిచేసుకున్నాడు.  అయితే వీరి వివాహ బంధానికి కొద్దిరోజుల్లోనే బీటలు వారాయి. దీన్ని భరించలేకపోయిన అతడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలా సూసైడ్ చేసుకుంటూ ఓ వీడియోను రికార్డు చేశాడు.

అయితే అతడి మృతదేహం వద్ద ఓ సూసైడ్ లేటర్ పోలీసులకు లభించింది. ఇందులో తన ఆత్మహత్యకు గల కారణాలను చౌహాన్ ఇలా వివరించాడు. తన భార్యను ఎంతగానో ప్రేమించానని, అలాంటి ఆమె తనను అనుమానించడంతో తట్టుకోలేక పోయానని తెలిపాడు. అంతే కాకుండా తనను అత్తింటివారు తాంత్రికుల వద్దకు తీసుకుని వెళ్లి పూజలు చేయించేవారని మృతుడు తన సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు. తల్లిదండ్రులను ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నానని అలాంటి తన భార్యే ఇలా అనుమానించడం తట్టుకోలేక పోయానని తెలిపాడు. దీంతో తనకు బ్రతకాలని లేకపోవడంతో ఈ ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సూసైడ్ లెటర్ లో పేర్కొన్నాడు. 

చౌహాన్ సూసైడ్ వీడియో సోషల్ మీడియా వైరల్ గా మారింది. దీంతో స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి  సూసైడ్ లేటర్ ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
   

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం