
ఉత్తరాఖండ్‌లో కేదార్‌నాథ్ యాత్ర కొనసాగుతోంది. అందులో భాగంగా మందాకిని నదికి మీదుగా యాత్రికులు నడుస్తున్నారు. ఇటీవల కురుస్తున్న వానల వల్ల ఆ నది భారీగా ప్రవహిస్తోంది. దీంతో అక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా ఓ యువకుడు కూడా ప్రమాదానికి గురయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆర్ఎస్ఎస్, ప్రధాని మోడీ రాజ్యాంగాన్నే మార్చాలనుకుంటున్నారు - ఆప్ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్
వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరాఖండ్ లోని కేదార్ నాథ్ యాత్రలో భాగంగా పలువురు యాత్రికులు మందాకిని నదికి మీదుగా నడుస్తున్నారు. ఈ క్రమంలో ఓ యువకుడు సెల్పీ తీసుకోవాలని ప్రయత్నించాడు. దీంతో అతడు కాలు జారి నదిలో పడిపోయాడు. ఈ ఘటన రాంబాడ సమీపంలో జరిగింది.
నదిలో పడిన వెంటనే ఆ యువకుడు ప్రవాహానికి కొట్టుకుపోయాడు. అయితే కొంత దూరం వెళ్లిన తరువాత బండరాళ్లను చాకచక్యంగా పట్టుకొన్నాడు. వాటిపై ఆగిపోయాడు. ఆ యువకుడు జారి పడటం, బండరాళ్లపై ఆగిపోవడాన్ని స్థానికులు గమనించారు. వెంటనే సహాయక చర్యలు మొదలుపెట్టారు. తాళ్ల సాయంతో ఆ యువకుడిని బయటకు తీసుకొని వచ్చారు, అయితే ఈ యువకుడు ప్రాణాలను అరచేతిలో పట్టుకొని బండలపై నిలబడి ఉండటం, సహాయక చర్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.