నా ప్రత్యర్థులు కూడా నా గురువులే.. : ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాహుల్ గాంధీ

Published : Sep 05, 2023, 02:57 PM IST
 నా ప్రత్యర్థులు కూడా నా గురువులే.. : ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాహుల్ గాంధీ

సారాంశం

Teachers Day 2023: తన ప్రత్యర్థులను కూడా తన గురువులుగా భావిస్తానని కాంగ్రెస్ మాజీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ అన్నారు. "భార‌త జాతిపిత మహాత్మాగాంధీ, గౌతమ బుద్ధుడు, శ్రీ నారాయణ గురు వంటి మహానుభావులను తాను గురువులుగా భావిస్తాననీ, సమాజంలోని ప్రజలందరి సమానత్వం గురించి జ్ఞానాన్ని మనకు అందించారనీ, ప్రతి ఒక్కరి పట్ల కరుణ, ప్రేమను చూపించారని" రాహుల్ గాంధీ పేర్కొన్నారు.  

Congress leader Rahul Gandhi: తన ప్రత్యర్థులను కూడా తన గురువులుగా భావిస్తానని కాంగ్రెస్ మాజీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ అన్నారు. "భార‌త జాతిపిత మహాత్మాగాంధీ, గౌతమ బుద్ధుడు, శ్రీ నారాయణ గురు వంటి మహానుభావులను తాను గురువులుగా భావిస్తాననీ, సమాజంలోని ప్రజలందరి సమానత్వం గురించి జ్ఞానాన్ని మనకు అందించారనీ, ప్రతి ఒక్కరి పట్ల కరుణ, ప్రేమను చూపించారని" రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

ఫేస్ బుక్ ఒక పోస్టులో రాహుల్ గాంధీ స్పందిస్తూ.. "ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరికీ నా వందనాలు. భారత మాజీ రాష్ట్రపతి డా. సర్వపల్లి రాధాకృష్ణన్ జీ జయంతి సందర్భంగా వారికి వినమ్ర నివాళి. జీవితంలో గురు స్థానం ఎంతో ఉన్నతమైనది, మీ జీవన మార్గాన్ని వెలిగించేది, మిమ్మల్ని సన్మార్గంలో నడవడానికి ప్రేరణ నిస్తుంది. సమాజంలో ప్రజల సమానత్వ జ్ఞానాన్ని, అందరి పట్ల కరుణ, ప్రేమను అందించిన మహాత్మాగాంధీ, గౌతమ్ బుద్ధ, శ్రీ నారాయణ గురు వంటి మహానుభావులను నేను గురుగా భావిస్తున్నాని" పేర్కొన్నారు.అలాగే, "భారతదేశ ప్రజలు కూడా గురువులు, మన దేశ భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనం, ప్రతి సమస్యను ధైర్యంగా పోరాడేలా స్ఫూర్తినిచ్చేవారు, వినయానికి తపస్సుకు నిలువెత్తు రూపం. నేను నడిచే దారి పరిపూర్ణమైనది.. ముందుకు సాగడానికి ఖర్చు తక్కువే అని బోధించే నా ప్రత్యర్థులను కూడా గురువుగా భావిస్తాను" అని రాహుల్ గాంధీ అన్నారు.

కాగా, 1962 నుండి 1967 వరకు భారతదేశ రెండవ రాష్ట్రపతిగా పనిచేసిన మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్‌కు నివాళిగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటారు. డాక్టర్ రాధాకృష్ణన్ ఆదర్శవంతమైన ఉపాధ్యాయుడు మాత్రమే కాదు, విద్య-తత్వశాస్త్రంలో గణనీయమైన కృషి చేశారు.1962లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ రాష్ట్రపతి అయినప్పటి నుంచి ఉపాధ్యాయ దినోత్సవ చరిత్ర కొనసాగుతోంది. సెప్టెంబర్ 5న తన పుట్టిన రోజు వేడుకలకు అనుమతించాలని పూర్వ విద్యార్థులు, స్నేహితులు కోరారు. దీనిపై స్పందించిన డాక్టర్ రాధాకృష్ణన్ తన జన్మదిన వేడుకలకు బదులు ఉపాధ్యాయులను, ఉదాత్తమైన ఉపాధ్యాయ వృత్తిని గౌరవించడానికి ఈ రోజును అంకితం చేయాలని సూచించారు. ఒక దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని, దీనిని సెలబ్రేట్ చేసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. అప్పటి నుండి, భారతదేశంతో పాటు అనేక ఇతర దేశాలలో సెప్టెంబర్ 5 ను ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Modi speech at the African Parliament:భారత్–ఇథియోపియా సంబంధాల్లో కొత్త అధ్యాయం | Asianet News Telugu
Reliance Jio : అంబానీ మామ న్యూఇయర్ గిప్ట్ ...జియో యూజర్స్ కి రూ.35,100..!