బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న సీమా హైదర్ ? ‘ఎ టైలర్ మర్డర్ స్టోరీ’కి ఆడిషన్స్ ఇచ్చిన పాకిస్థాన్ మహిళ

Published : Aug 03, 2023, 12:35 PM IST
బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న సీమా హైదర్ ? ‘ఎ టైలర్ మర్డర్ స్టోరీ’కి ఆడిషన్స్ ఇచ్చిన పాకిస్థాన్ మహిళ

సారాంశం

పాకిస్థాన్ నుంచి భారత్ లోకి అక్రమంగా ప్రవేశించి, యూపీలోని యువకుడిని పెళ్లి చేసుకున్న సీమా హైదర్ సినిమాల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆమెను ఓ బాలీవుడ్ సినిమాలో నటించాలని ఇద్దరు దర్శకులు సంప్రదించారు. ఆమె నుంచి ఆడిషన్స్ కూడా తీసుకున్నారు.

పబ్జీ గేమ్ ద్వారా పరిచయమైన ఇండియాకు చెందిన యువకుడిని పెళ్లి చేసుకునేందుకు అక్రమంగా సరిహద్దులు దాటిన పాకిస్థాన్ కు చెందిన సీమ్ హైదర్ ఇప్పుడు సెలబ్రేటీగా మారనుంది. పాకిస్థాన్ నుంచి వచ్చిన విషయం వెలుగులోకి రావడంతో గత కొంత కాలం నుంచి ఆమె ప్రతీ రోజూ వార్తల్లో నిలుస్తోంది. తన వంతు లైమ్ లైట్ ను ఆస్వాదిస్తూ ఇప్పుడు స్టార్ డమ్ దిశగా పయనిస్తోంది. ఉదయ్ పూర్ టైలర్ హత్య నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా కోసం సీమా హైదర్ ఆడిషన్స్ ఇచ్చిందని ‘టైమ్స్ నౌ’ కథనం పేర్కొంది. 

బద్రీనాథ్ జాతీయ రహదారిపై భారీగా కూలిన కొండచరియలు.. నిలిచిన రాకపోకలు

గతేడాది రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ కు చెందిన టైలర్ కన్హయ్య లాల్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ఆయన హత్యనే ఇతివృత్తంగా తీసుకొని రూపొందిస్తున్న సినిమాకు ‘ఎ టైలర్ మర్డర్ స్టోరీ’ పేరు ఖరారు చేశారు. ఈ చిత్రంలో నటించాలని కోరుతూ జానీ ఫైర్ ఫాక్స్ ప్రొడక్షన్ హౌస్ బృందం గ్రేటర్ నోయిడాలో సీమాను కలిసింది. దీని కోసం ఆమె నుంచి ఆడిషన్స్ కూడా తీసుకుంది. 

కోర్టు కేసు సెటిల్ మెంట్ కు అంగీకరించలేదలని మహిళపై దాడి.. బట్టలు చింపేసి మరీ దారుణం.. వీడియో వైరల్

జయంత్ సిన్హా, భరత్ సింగ్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా ఆడిషన్ లో ఇద్దరు దర్శకులు పాల్గొన్నారు. ఈ సినిమాలో సీమా హైదర్ రా ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. అయితే ఐఎస్ఐ ఏజెంట్ అనే అనుమానంతో సీమా హైదర్ ను ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె బెయిల్ పై బయట ఉన్నారు. అయితే పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాతే సినిమా ఆఫర్ ను అంగీకరిస్తానని సీమా చెప్పినట్లు తెలుస్తోంది.

సెల్ ఫోన్ ఛార్జర్ స్విచ్చ్ ఆఫ్ చేయడం మర్చిపోయిన తండ్రి.. పిన్ను నోట్లో పెట్టుకొని 8 నెలల చిన్నారి మృతి

గతేడాది ముహమ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలతో పెద్ద వివాదానికి కారణమైన నుపుర్ శర్మకు మద్దతుగా టైలర్ కన్హయ్య లాల్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. దీంతో కస్టమర్స్ వేషంలో టైలర్ షాపులోకి ప్రవేశించిన మహ్మద్ రియాజ్ అట్టారీ, గౌస్ మహ్మద్ లు పట్టపగలు కన్హయ్యలాల్ తల నరికి చంపారు. కన్హయ్య సోషల్ మీడియాలో పోస్టు పెట్టడంతోనే అతడిని హతమార్చామని ఓ వీడియో కూడా నిందితులు రికార్డు చేశారు. ఈ హత్య నేపథ్యంలో దాదాపు రూ.25 కోట్ల నుంచి రూ.30 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న 'ఎ టైలర్ మర్డర్ స్టోరీ' ఈ ఏడాది నవంబర్ లో విడుదలయ్యే అవకాశం ఉందని ‘ఇండియా టుడే’ తెలిపింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu