సీఎం విజయన్ అధికారిక నివాసంలో ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ.. అసలేం జరగిందంటే..?

By Sumanth KanukulaFirst Published Dec 6, 2022, 3:49 PM IST
Highlights

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ అధికారిక నివాసం క్లిఫ్‌ హౌస్‌లో ప్రమాదవశాత్తు తుపాకీ పేలింది. మంగళవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ అధికారిక నివాసం క్లిఫ్‌ హౌస్‌లో ప్రమాదవశాత్తు తుపాకీ పేలింది. మంగళవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. భద్రతా అధికారి తన పిస్టల్‌ను శుభ్రం చేస్తుండగా ఈ ఘటన జరిగిందని మ్యూజియం పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. ఉదయం 9.15 గంటలకు జరిగిన ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారి తెలిపారు. ఈ ఘటనపై జరిగిన సమయంలో సీఎం విజయన్ క్లిఫ్ హౌస్‌లో లేరని సమాచారం. ఆయన అప్పటికే అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు ఇంట్లో నుంచి బయలుదేరి వెళ్లారని తెలుస్తోంది. 

ఔట్‌పోస్టు వద్ద భద్రతా అధికారి సర్వీస్ వెపన్‌ను శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు తుపాకీ పేలినట్లు పోలీసులు వివరించారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని చెప్పారు. క్లిఫ్ హౌస్ హైసెక్యూరిటీ జోన్ కావడంతో ఈ ఘటనను పోలీసు ఉన్నతాధికారులు సీరియస్‌గా పరిగణించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.

 

Kerala | Service weapon of a security official at Cliff House, official residence of CM Pinarayi Vijayan accidentally went off today during cleaning. CM wasn't present as he had left early for Assembly session. No injuries reported.Trivandrum Police has called an official enquiry

— ANI (@ANI)
click me!