గతంలో ప్రధానికి భద్రతా లోపాలు ఏర్పడ్డాయా? ఎప్పుడెప్పుడు వైఫల్యాలు ఏర్పడ్డాయంటే..!

By Mahesh KFirst Published Jan 6, 2022, 4:18 PM IST
Highlights

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి తన పంజాబ్ పర్యటనలో భద్రతా లోపం ఏర్పడింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. అయితే, గతంలోనూ ఇలా ప్రధానమంత్రికి భద్రతా లోపం ఏర్పడిన సందర్భాలు ఉన్నాయి. నరేంద్ర మోడీతోపాటు అంతకు ముందటి ప్రధాని మన్మోహన సింగ్‌కు కూడా ఇలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయి. 
 

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(PM Modi) తన పంజాబ్ పర్యటన(Punjab Visit) దేశవ్యాప్తంగా కలకలం రేపింది. భటిండా నుంచి ఫెరోజ్‌పుర్‌కు రోడ్డు మార్గాన వెళ్లుతుండగా రైతులు ఆందోళన చేయడం.. సుమారు 20 నిమిషాలు ప్రధాన మంత్రి ఓ ఫ్లై ఓవర్‌పై నిలిచిపోవాల్సి వచ్చింది. భద్రతా లోపం(Security Breach) ఏర్పడ్డ కారణంగా ఆయన అక్కడి నుంచి భటిండాకే వెనుదిరిగి వెళ్లిపోయారు. భటిండా దాకా ప్రాణాలతో చేరగలిగానని, సీఎంకు థాంక్స్ చెప్పాలని ప్రధాని మోడీ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం మండిపడింది. పంజాబ్ ప్రభుత్వం ఎస్‌వోఎస్ ప్రోటోకాల్ పట్టించుకోలేదని ఆగ్రహించింది. ఈ నేపథ్యంలోనే ప్రధాన మంత్రికి భద్రతా లోపం ఏర్పడ్డ సంఘటనలపై చర్చ జరుగుతున్నది. తాజాగా, పంజాబ్‌లోనే కాదు.. గతంలోనూ ప్రధాన మంత్రికి భద్రతా లోపం పలు సందర్భాల్లో ఏర్పడింది.

ఫిబ్రవరి 2019: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 2019లో ఇలాగే.. భద్రతలో లోపాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. ఉత్తర 24 పరగణాలలోని అశోక్ నగర్‌లో నిర్వహించిన ఓ సదస్సుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హాజరయ్యారు. అక్కడ భద్రతలో పొరపాటు వచ్చింది. భద్రతా చర్యల్లో లోపంతో ఆ సదస్సులో తొక్కిసలాట వంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ప్రధాని మోడీ తన ప్రసంగాన్ని 20 నిమిషాలకే ముగించుకోవాల్సి వచ్చింది. వెంటనే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ రంగంలోకి దిగింది. ప్రధాన మోడీకి రక్షణ కల్పించింది.

Also Read: మోదీ పర్యటనలో భద్రతా వైఫల్యం.. సుప్రీం కోర్టులో పిల్ దాఖలు.. సీజేఐ ఎన్వీ రమణ ధర్మాసనం ఏమందంటే

మే 2018: అంతకు ముందు సంవత్సరంలోనూ ప్రధాని మోడీ ఇలాంటి సమస్యను ఎదుర్కొన్నారు. ప్రధాని మోడీ అభిమానిని అని చెప్పుకున్న ఓ వ్యక్తి ఎస్‌పీజీ రక్షణ వలయాన్ని ఛేదించుకుని ప్రధానివైపు రాగలిగాడు. ఈ ఘటన విశ్వ భారతి స్నాతకోత్సవ కార్యక్రమంలో చోటుచేసుకుంది.

డిసెంబర్ 2017: ఈ సంవత్సరంలో ప్రధాని మోడీ ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ బుద్ధ నగరంలో మెట్రో లైన్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ఆయన ఉత్తరప్రదేశ్‌లో ప్రయాణిస్తుండగా ఆయన కాన్వాయ్ రెండు నిమిషాలపాటు మరో వైపునకు రెండు నిమిషాలపాటు వెళ్లింది. నోయిడా పోలీసు వల్ల ఈ సమస్య ఎదురైంది. ప్రధాని మోడీ భద్రత నిబంధనలు పాటించడంలో విఫలం కావడం కారణంగా ఇద్దరు నోయిడా పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు.

2014 డిసెంబర్ 31: మహారాష్ట్రలో రాష్ట్ర ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేస్తున్న కార్యక్రమానికి ప్రధాని మోడీ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భద్రతా విధుల్లో ఉన్న ఒక పోలీసు ఇన్‌స్పెక్టర్, ఇద్దరు కానిస్టేబుళ్లు నిర్లక్ష్యంగా వ్యవహిరంచారు. దీంతో వీరి ముగ్గురిని సస్పెండ్ చేశారు.

Also Read: ప్రధాని మోదీ పర్యటనలో భద్రతా వైఫల్యానికి బాధ్యత ఎవరిది?.. వారి తప్పిదమేనా?.. మాజీ డీజీపీ ఏం చెప్పారంటే..

డిసెంబర్ 2010: అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కేరళలో పర్యటిస్తున్న సందర్భంలో ఆయన కాన్వాయ్‌కి ఓ ప్రైవేటు కారు అడ్డుగా వచ్చింది. దీంతో ఒక్కసారిగా భయాలు ఏర్పడ్డాయి. కానీ, అందులో పొరపాటు ఏమీ లేదని ఆ తర్వాత కేరళ ప్రభుత్వం పేర్కొంది.

నవంబర్ 2006: అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ఎస్కార్ట్‌లోని పైలట్ కారు తప్పు దారిలో వెళ్లింది. దీంతో ఆయన ఎస్కార్ట్ గందరగోళంలో పడింది. దీంతో కేరళ ప్రభుత్వం నుంచి దీనిపై సమగ్ర నివేదిక అందజేయాలని కేంద్రం ఆదేశించింది.

జులై 2006: అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ నివాసంలోకి ముగ్గురు యువకులు భద్రతా నిబంధనలకు విరుద్ధంగా చొచ్చుకు వెళ్లారు. వారిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. చివరకు భద్రతా లోపం ఏమీ జరగలేదని పీఎం ఆఫీసు వెల్లడించింది.

click me!