తెరపైకి శివాజీ.. హిందుత్వ స్థానేనా లౌకికత్వం..ఆసక్తికరంగా మహా రాజకీయం

By telugu teamFirst Published Nov 29, 2019, 5:54 PM IST
Highlights

సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన ఉద్ధవ్ ఠాక్రే ఐదేళ్లపాటు అమలు చేసేలా కామన్ మినిమం ప్రోగ్రాంను తన భాగస్వామ్య పక్షాలతో కలిసి రూపొందించారు. భారత రాజ్యాంగానికి కట్టుబడి లౌకిక విలువలతో సంకీర్ణ పార్టీలతో కలిసి పాలన కొనసాగించాలని ఇందులో నిర్ణయించారు. 

అనూహ్య పరిణామాలతో సాగిన సస్పెన్స్ థ్రిల్లర్ "కౌన్ బనేగా మహారాష్ట్ర సీఎం" కు తెరపడింది.  నిన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే ప్రమాణ స్వీకారం చేశారు. 

దాదర్‌లోని శివాజీ పార్క్‌లో ఆయనతో గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్, మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ థాక్రే, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ, ఆయన సతీమణి నీతా అంబానీ, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ హాజరయ్యారు. 

మహారాష్ట్రలో అధికారంలోకి వచ్చిన శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలతో కలిసి ఏర్పడిన మహారాష్ట్ర వికాస్ ఆఘాదీ సంకీర్ణ సర్కారు పేద ప్రజల కోసం రూపాయి క్లినిక్‌లు, పదిరూపాయలకే భోజనం పథకాలను అమలు చేయాలని నిర్ణయించింది. 

80 శాతం ప్రైవేటు ఉద్యోగాలు స్థానికులకే ఇప్పిస్తామని శివసేన ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు చేసేలా సంకీర్ణ కూటమి కామన్ మినిమం ప్రోగ్రాం లో వీటిని చేర్చింది.

Also read: గోవా రాజకీయాల్లో సంజయ్ రౌత్ వేలు... అక్కడ బీజేపీ అధికారం కోల్పోతుందని జోశ్యం

ప్రతీ మండలంలోనూ, రూపాయికే వైద్యం అందించేలా చిన్న ఆసుపత్రులేనన్నా, లేదా క్లినిక్ లేనన్నా ఏర్పాటు చేస్తామని, అందరికీ వైద్యబీమా కల్పిస్తామని మూడు పార్టీల నేతలు వెల్లడించారు. 

బలహీనవర్గాల మహిళలకు ఉచితంగా విద్య అందిస్తామని చెప్పారు. మూడు నెలల క్రితం ముంబయిలోని ఆరే అడవిలో మెట్రోరైలు షెడ్ కోసం వేలాది చెట్లను నరికారు. మెట్రోరైలు షెడ్ ను ఆరే కాలనీ నుంచి తరలించాలని కొత్త సర్కారు నిర్ణయించింది. ఆరే చెట్ల నరికివేతకు వ్యతిరేకంగా ఆదిత్య ఠాక్రే బాహాటంగానే అప్పటి మిత్రపక్షమైన బీజేపీని విమర్శించినా విషయం తెలిసిందే. 
 
సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన ఉద్ధవ్ ఠాక్రే ఐదేళ్లపాటు అమలు చేసేలా కామన్ మినిమం ప్రోగ్రాంను తన భాగస్వామ్య పక్షాలతో కలిసి రూపొందించారు. భారత రాజ్యాంగానికి కట్టుబడి లౌకిక విలువలతో సంకీర్ణ పార్టీలతో కలిసి పాలన కొనసాగించాలని ఇందులో నిర్ణయించారు. 

ప్రాంతం, కులం, మతం, భాషల ప్రాతిపదికగా ఎలాంటి వివక్ష చూపించమని మూడు పార్టీలు ప్రకటించాయి.మురికివాడల పునరావాస కార్యక్రమం కింద పేదలు తీసుకున్న రుణాలను మాఫీ చేయాలని యోచిస్తున్నారు.

కామన్ మినిమం ప్రోగ్రాం  ఏజెండాను సీనియర్ శివసేన నాయకుడు ఏక్ నాథ్ షిండే., ఎన్సీపీ నేత జయంత్ పాటిల్, కాంగ్రెస్ నేత బాలాసాహెబ్ థొరాట్, ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ లు నిన్న సాయంత్రం ఉద్ధవ్ ప్రమాణస్వీకారానికి ముందు విడుదల చేశారు.

Also read: సీఎంగా ఉద్థవ్ థాక్రే బాధ్యతలు: తర్వాతి రోజే ఫడ్నవీస్‌కు కోర్టు సమన్లు

5 ఏళ్లుగా మహారాష్ట్రలో నివాసమున్న వారిని స్థానికులుగా గుర్తించి వారికే 80 శాతం ప్రైవేటు ఉద్యోగాలు రిజర్వు చేస్తామని ప్రకటించారు. రైతులు తీసుకున్న రుణాల మాఫీపై కొత్త కేబినెట్ నిర్ణయం తీసుకుంటుందని నేతలు చెప్పారు.

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును ఈ కొత్త సర్కారు పక్కకు పెట్టనున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. రైతుల సమస్యలపైన్నే ముఖ్యంగా దృష్టాంతా పెట్టనున్నట్టు వారి మాటలను బట్టి అర్థమవుతుంది. ఈ  కామన్ మినిమం ప్రోగ్రాం లో శివసేన ఒకింత హిందుత్వ సిద్ధాంతం నుంచి పక్కకు జరిగినట్టుగా మనకి అనిపించినా, మహారాష్ట్ర జీవనవిధానాన్ని ప్రతీకలైన శివాజీ మహారాజ్ వంటి మహాపురుషుని రూపాన్ని ముందుకు తీసుకొచ్చి, నూతన లౌకిక రాజకీయాలకు వారు నాంది పలికారు. 

click me!