స్క్రీనింగ్ ఉండాల్సిందే.. కట్టడి చేయాల్సిందే: ఓటీటీలపై సుప్రీం వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Mar 4, 2021, 2:13 PM IST
Highlights

ఓటీటీ ఫ్లాట్‌ఫాంలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఓటీటీ ఫ్లాట్‌ఫాంలపై స్క్రీనింగ్ ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. పలు ఓటీటీలు పోర్నోగ్రఫీని కూడా చూపిస్తున్నాయని ..వాటిని కట్టడి చేయాల్సిన  అవసరం వుందని వ్యాఖ్యానించింది సుప్రీం

ఓటీటీ ఫ్లాట్‌ఫాంలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఓటీటీ ఫ్లాట్‌ఫాంలపై స్క్రీనింగ్ ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. పలు ఓటీటీలు పోర్నోగ్రఫీని కూడా చూపిస్తున్నాయని ..వాటిని కట్టడి చేయాల్సిన  అవసరం వుందని వ్యాఖ్యానించింది సుప్రీం.

దీనికి సంబంధించి రెగ్యులేషన్స్ ధర్మాసనం ఎదుట ఉంచాలని కేంద్రాన్ని ఆదేశించింది. తాండవ వెబ్ సిరీస్‌కు సంబంధించిన పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. 

కాగా, సోషల్ మీడియాతోపాటు ఓటీటీ ప్లాట్ (ఓవర్ ది టాప్) ఫామ్స్‌పై నియంత్రణ కోసం భారత ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. వాటి నియంత్రణలకు పక్కా మార్గదర్శకాలను రూపొందించింది.

వాటిని ఫిబ్రవరి 26వ తేదీన విడుదల కూడా చేసింది. నిజానికి ఈ అంశం చాలా కాలంగా చర్చల్లో నానుతోంది. సినిమాలకు సెన్సార్ బోర్డు వుంది కానీ అవే సినిమాలను ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై విడుదల చేసే ఎలాంటి నియంత్రణ లేదు.

సినిమాలలో సెన్సార్ బోర్డు అభ్యంతరం చెప్పిన సీన్లను యాడ్ చేసి.. లేదా అసలు సెన్సార్ బోర్డు ముందుకే పంపని క్లిప్పింగులను యాడ్ చేసి మరీ ఓటీటీ ప్లాట్ ఫామ్స్‌పై విడుదల చేస్తున్నారు.

దీంతో ఓటిటిలో అసభ్య, అశ్లీల, హింసాత్మక అంశాలకు సంబంధించిన కంటెంట్‌పై నిషేధం విధించారు. ఓటీటీలో ప్రసారం అయ్యే సినిమాలు, వెబ్ సిరీస్ కంటెంట్‌ను వయస్సు ఆధారంగా 5 విభాగాలుగా విభజన చేశారు.

సామాజిక ఉద్రిక్తతలకు దారితీసే కంటెంట్‌పై నిషేధం కొనసాగుతుంది. జాతి సమగ్రత, సమైక్యతను దెబ్బతీసేలా ఉండే అంశాలపై నిషేధం కొనసాగిస్తారు. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్‌పై కఠిన ఆంక్షలు విధించారు.

మహిళలు, చిన్నారులు, దళితులను కించపరిచేలా ఉండే అంశాలపై నిషేధం విధించారు. ఈ నిషేధాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలను ప్రతిపాదించారు. ఫిర్యాదు చేసిన 24 గంటల్లోనే ఫేక్ న్యూస్‌ను సైట్స్, సోషల్ మీడియాలోంచి తొలగించాలి.

ఇలాంటి వాటిపై వచ్చే ఫిర్యాదులను పరిశీలించి పరిష్కరించే అధికారులు 24 గంటలు దర్యాప్తు సంస్థలకు అందుబాటులో ఉండాలని కేంద్రం తన గైడ్‌లైన్స్‌లో స్పష్టం చేసింది. 
 

click me!