జార్ఖండ్‌లో మందుపాతర పేల్చిన మావోలు: ముగ్గురు జవాన్ల మృతి

Published : Mar 04, 2021, 02:12 PM ISTUpdated : Mar 04, 2021, 02:20 PM IST
జార్ఖండ్‌లో మందుపాతర పేల్చిన మావోలు: ముగ్గురు జవాన్ల మృతి

సారాంశం

జార్ఖండ్ రాష్ట్రంలో మావోయిస్టులు రెచ్చిపోయారు. కూంబింగ్ చేస్తున్న పోలీసులను లక్ష్యంగా చేసుకొని మందుపాతరను పేల్చారు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు మరణించారు.గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

జార్ఖండ్: జార్ఖండ్ రాష్ట్రంలో మావోయిస్టులు రెచ్చిపోయారు. కూంబింగ్ చేస్తున్న పోలీసులను లక్ష్యంగా చేసుకొని మందుపాతరను పేల్చారు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు మరణించారు.గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

కూంబింగ్ చేస్తున్న జవాన్లను లక్ష్యంగా చేసుకొని మావోయిస్టులు మందుపాతరను పేల్చారని జార్ఖండ్ డీజీపీ డీజీ నీరజ్ సిన్హా తెలిపారు. ఈ ఘటన ఇవాళ ఉదయం చోటు చేసుకొందని పోలీసులు తెలిపారు.ఈ ఘటనలో గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన జవాన్లకు మెరుగైన వైద్య సహాయం అందించాలని పోలీసు ఉన్నతాధికారులు కోరారు.

లాంగీ అడవిలో మావోల మందుపాతరకు ముగ్గురు జేజే ఏజీ-11 విభాగానికి చెందిన ముగ్గురు జవాన్లు మరణించారు. నలుగురు గాయపడ్డారని అధికారులు తెలిపారు.  రాంచీలోని మెడికా ఆసుపత్రిలో జవాన్లకు చికిత్స అందిస్తున్నారు.

 

గత నెలలో భద్రతా దళాలు, మావోయిస్టులు మధ్య మూడు రోజుల్లో నాలుగు ఎన్‌కౌంటర్లు జరిగిన ప్రదేశంలో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ సమయంలోనే మావోలు మందుపాతర పేల్చారని అధికారులు తెలిపారు.
 

PREV
click me!

Recommended Stories

గంటకు 9 కి.మీ స్పీడ్, 46 కి.మీ ప్రయాణానికి 5 గంటలా..! దేశంలోనే స్లోయెస్ట్ ట్రైన్ ఏదో తెలుసా?
Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !