కాశ్మీర్‌లో ఆంక్షల సడలింపు: తిరిగి ప్రారంభమైన పాఠశాలలు

Siva Kodati |  
Published : Aug 19, 2019, 11:58 AM ISTUpdated : Aug 19, 2019, 12:26 PM IST
కాశ్మీర్‌లో ఆంక్షల సడలింపు: తిరిగి ప్రారంభమైన పాఠశాలలు

సారాంశం

ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర విభజన తర్వాత ఆంక్షలు, సైనికుల తుపాకీ నీడన గడిపిన జమ్మూకాశ్మీర్‌లో తిరిగి సాధారణ పరిస్ధితులు నెలకొల్పేందుకు గాను సోమవారం నుంచి ఆంక్షలు సడలించనున్నారు. 35 పోలీస్ స్టేషన్ల పరిధిలో 6 నుంచి 8 గంటల పాటు ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. 

ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర విభజన తర్వాత ఆంక్షలు, సైనికుల తుపాకీ నీడన గడిపిన జమ్మూకాశ్మీర్‌లో తిరిగి సాధారణ పరిస్ధితులు నెలకొల్పేందుకు గాను సోమవారం నుంచి ఆంక్షలు సడలించనున్నారు.

35 పోలీస్ స్టేషన్ల పరిధిలో 6 నుంచి 8 గంటల పాటు ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ సమయంలో ప్రజలు నిత్యావసరాలు కొనుగోలు చేసుకోవచ్చని తెలిపారు. అలాగే ల్యాండ్ ఫోన్లు, ఇంటర్‌నెట్ సేవలపైనా నిషేధాన్ని ఎత్తివేసే అవకాశాలున్నాయి.

మరోవైపు పాఠశాలు సైతం తిరిగి ప్రారంభిస్తున్నట్లు జమ్మూకాశ్మీర్ ప్రణాళిక, అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రోహిత్ కన్సాల్ తెలిపారు. సోమవారం నుంచి కాశ్మీర్‌లో ప్రభుత్వ కార్యాలయాలు యధావిథిగా పనిచేస్తాయని ఆయన పేర్కొన్నారు.     

ఇండియన్ ఆర్మీపై సంచలన ఆరోపణలు.. కశ్మీరీ యువతిపై కేసు

కోలుకుంటున్న కాశ్మీరం: సోమవారం నుంచి తెరచుకోనున్న విద్యాసంస్థలు

ఆర్టికల్ 370 రద్దు: సుప్రీంకోర్టుకెక్కిన ఒమర్ అబ్దుల్లా పార్టీ

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్