లైంగిక వేధింపుల కేసులో: తెహల్కా మాజీ ఎడిటర్ తేజ్‌పాల్‌కు సుప్రీం షాక్

Siva Kodati |  
Published : Aug 19, 2019, 11:39 AM IST
లైంగిక వేధింపుల కేసులో: తెహల్కా మాజీ ఎడిటర్ తేజ్‌పాల్‌కు సుప్రీం షాక్

సారాంశం

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న తెహల్కా మ్యాగజైన్ మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తనపై నమోదైన లైంగిక వేధింపుల కేసును రద్దు చేయాల్సిందిగా తరుణ్ వేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న తెహల్కా మ్యాగజైన్ మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తనపై నమోదైన లైంగిక వేధింపుల కేసును రద్దు చేయాల్సిందిగా తరుణ్ వేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది.

జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ షా, జస్టిస్ బీఆర్ గావైలతో కూడిన ధర్మాసనం ఆగస్టు 6న సమావేశమై తేజ్‌పాల్ కేసుపై తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. కాగా.. తన కింద పనిచేసే జూనియర్ మహిళా జర్నలిస్టుపై గోవాలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో తేజ్‌పాల్ అత్యాచారం చేశాడన్నది అభియోగం. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆయనను 2013 నవంబర్‌లో గోవా పోలీసులు అరెస్ట్ చేశారు. 

PREV
click me!

Recommended Stories

Interesting Facts : మనం ఏడ్చినప్పుడు ముక్కు ఎందుకు కారుతుంది..?
UPSC Interview Questions : గోరింటాకు పెట్టుకుంటే చేతులు ఎర్రగానే ఎందుకు మారతాయి..?