Omicron ఎఫెక్ట్: బెంగాల్‌లో రేపటి నుండి విద్యా సంస్థల మూసివేత

By narsimha lodeFirst Published Jan 2, 2022, 5:08 PM IST
Highlights

ఒమిక్రాన్ కేసుల తీవ్రత కారణంగా బెంగాల్ సర్కార్ ముందు జాగ్రత్త చర్యలు తీసుకొంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 50 శాతంతోనే ప్రభుత్వ కార్యాలయాలను నిర్వహించాలని మమత బెనర్జీ సర్కార్ నిర్ణయం తీసుకొంది. విద్యా సంస్థలను రేపటి నుండి మూసివేశారు.

కోల్‌కత్తా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కరోనా ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలను విధించింది.  జనవరి 3 నుండి స్కూల్స్, కాలేజీలు, యూననిర్శిటీలను మూసివేస్తున్నట్టుగా ప్రకటించిందిఅంతేకాదు బ్యూటీపార్లర్లు, జూ, వినోద పార్కులను మూసివేస్తామని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హెచ్‌కే ద్వివేది తెలిపారు. కోల్‌కత్తాలోని లోకల్ ట్రైన్స్ సోమవారం నాడు 50 శాతం సామర్ధ్యంతో రాత్రి 7 గంటల వరకు మాత్రమే నడుస్తాయని ప్రభుత్వం ప్రకటించింది.

అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ కార్యాలయాలు 50 శాతం కెపాసిటితో నడుస్తాయని ప్రభుత్వం తేల్చి చెప్పింది. అయితే అన్ని అడ్మినిస్ట్రేటివ్ సమావేశాలు కూడా వర్చువల్ విధానంలో నడుస్తాయని  ప్రభుత్వం  తెలిపింది.  రాష్ట్రంలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఉందని బెంగాల్ సర్కార్ తెలిపింది.

also read:ఒమిక్రాన్ ఎఫెక్ట్.. తమిళనాడులో 10వ తేదీ వరకు స్కూల్స్ బంద్, స్టాలిన్ సర్కార్ కీలక నిర్ణయం

అన్ని షాపింగ్ మాల్స్, మార్కెట్‌లు రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంచడానికి అనుమతించారు. అయితే 50 శాతం సామర్ధ్యంతో పని చేస్తాయి.ముంబై, న్యూఢిల్లీల నుండి విమానాలను జనవరి 5 నుండి వారానికి రెండు సార్లు మాత్రమే నడిచేలా అనుమతించారు. యూకే నుండి విమానాలను అనుమతించబోమని మమత బెనర్జీ సర్కార్ తేల్చి చెప్పింది.

సినిమా థియేటర్లు 50 శాతం కెపాసిటీతో పనిచేయడానికి మాత్రమే అనుమతించారు. సభలు, సదస్సులకు ఒకేసారి 200 మంది వ్యక్తులకే పరిమితం చేశారు. అంతేకాదు ఆయా హాల్స్ లో 50 శాతం కెపాసిటీకే పరిమితం చేస్తూ బెంగాల్ ప్రభుత్వం ఇవాళ ఆదేశాలు జారీ చేసింది.పెళ్లిళ్లకు 50 మంది కంటే ఎక్కువ మందిని అనుమతించరు  అంత్యక్రియల్లో 20 మందిని మాత్రమే అనుమతించనున్నారు.

 బెంగాల్ రాష్ట్రంలో కరోనా ఒమిక్రాన్ కేసులు 20కి చేరుకొన్నాయి. శనివారం నాడు బెంగాల్ రాష్ట్రంలో కరోనా కేసులు 4,512 కి చేరింది.  బెంగాల్ లో సాధారణంగా 1,061 కేసులు నమోదయ్యేవి. అయితే సాధారణ కేసుల కంటే 2,398 కేసులు నమోదు కావడంతో బెంగాల్ సర్కార్ ఆంక్షలను విధించింది.కొత్త సంవత్సర వేడుకలను పురస్కరించుకొని కోల్‌కత్తాతో పాటు రాష్ట్రంలో పలు చోట్ల ప్రజలు పెద్ద ఎత్తున గుంపులుగా ఉండడంతో కరోనా కేసుల సంఖ్య పెరిగింది.

భారత్ లో గత కరోనా సాధారణ కేసులతో పాటు, అత్యంత ప్రమాదకరమైన వేరియంట్ గా భావిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ కేసులు సైతం పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 27,553 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో వైరస్ తో పోరాడుతూ 284 మంది ప్రాణాలు కోల్పోయారు. యాక్టివ్ కేసులు సైతం పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 1,22,801 క్రియాశీల కేసులు ఉన్నాయి.

 కొత్తగా 9,249 మంది కరోనా వైరస్ నుంచి బటయపడ్డారు. ఒమిక్రన్ కేసులు సైతం పెరిగాయి. ఇప్పటివరకు దేశంలో 1525 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.  కరోనా కొత్త కేసుల్లో అధికంగా దేశరాజధాని ఢిల్లీలో 2,716 కేసులు నమోదయ్యాయి


 

click me!