విద్యార్థుల తల్లులకు అసభ్యకర మెసేజ్ లు, వీడియోలు.. కీచక టీచర్ సస్పెండ్...

Published : Jul 01, 2022, 12:08 PM IST
విద్యార్థుల తల్లులకు అసభ్యకర మెసేజ్ లు, వీడియోలు.. కీచక టీచర్ సస్పెండ్...

సారాంశం

పిల్లలకు బుద్దిగా పాఠాలు చెప్పాల్సిన టీచర్.. వారి తల్లులతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. వారి పాలిట కీచకుడిగా మారాడు. దీంతో స్కూల్ నుంచి అతడిని సస్పెండ్ చేశారు. 

బెంగళూరు :  బెంగళూరులోని మధుగిరి తాలూకా దొడ్డహట్టి గ్రామానికి చెందిన ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుడు ఒకరు నీచానికి దిగజారాడు. దీనికి గాను సదరు ఉపాధ్యాయుడు ఎం సురేష్  ఎట్టకేలకు సస్పెండ్ అయ్యాడు. ఈ కీచక టీచర్ చేసిన పని ఏంటంటే విద్యార్థుల తల్లులతో అసభ్యంగా ప్రవర్తించడం. దీని మీద ఆరోపణలు వెల్లువెత్తడంతో సస్పెండ్ అయ్యాడు. ఉపాధ్యాయుడు సురేష్ దొడ్డహట్టి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్నాడు. 

ఏదైనా అవసరాల మీద స్కూల్ కు వచ్చే విద్యార్థుల తల్లులతో  అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. వారి మొబైల్ నెంబర్లు తీసుకుని అసభ్యంగా ఎస్ఎంఎస్ లు, వీడియోలు పంపించేవాడు. అలా వికృతానందం పొందేవాడు. అంతటితో ఆగకుండా తరచు కాల్ చేసి విసిగిస్తూ ఉండేవాడు. ఇక ఊరిలోని పేద యువకులకు  రాజకీయంగా సహాయం చేస్తానని చెప్పేవాడు. వారిని చేరదీసి  సాయంత్రాలు వారితో కలిసి మందు పార్టీలు చేసుకునేవాడు.  

పాఠశాల నిధులను దుర్వినియోగం చేయడం.. గైర్హాజరు కావడం,  ఆలస్యంగా రావడం, ముందే వెళ్లిపోవడం లాంటి చికాకులు పెట్టేవాడు. వీటన్నింటి వల్ల పాఠశాలకు పెద్ద సమస్యగా మారాడు. దీంతో  మధుగిరి డీడీపీఐకి నెలక్రితం ఫిర్యాదు చేశారు.  ఆరోపణలు అన్నీ నిజమేనని తేలడంతో ఉపాధ్యాయుడు సురేష్ ను సస్పెండ్ చేశారు.

పెద్దపల్లి జిల్లాలో దారుణం... విద్యార్థినులకు పోర్న్ వీడియోలో చూపించిన కీచక టీచర్

ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటనే తమిళనాడులో మార్చి 17న వెలుగులోకి వచ్చింది. పాఠాలు భోదిస్తూ మార్గదర్శకంగా ఉండాల్సిన ప్రొఫెసర్ పాడుబుద్ధితో తన దగ్గర చదువుకునే విద్యార్థినిపై కన్నేశాడు. తన కోరిక తీర్చాలని బాలికను హింసించేవాడు. చివరికి విద్యార్థిని ఆ వేధింపులు తట్టుకోలేక ప్రొఫెసర్ పై కళాశాల అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఉదాంతం తమిళనాడులో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోపి కన్యాకుమారి కళాశాలలో ఓ యువతి చదువుకుంటోంది. ఆ కళాశాలలోనే ప్రొఫెసర్ గా పని చేస్తున్న వాసుదేవన్ అనే వ్యక్తి ఆ విద్యార్థినిపై కన్నేశాడు. ఎలాగోలా ఆ విద్యార్థిని ఫోన్ నెంబర్ సంపాదించాడు. ఇక ఆ రోజు నుంచి ఆమెను అసభ్యకరమైన మెసేజ్ లు, వీడియోలను పంపుతూ తరచూ వేధించేవాడు. అతని కోరికలని తీర్చాలని సదరు విద్యార్థినిని శారీరకంగానూ, మానసికంగానూ తీవ్ర ఇబ్బందులు పెట్టేవాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరింపులకు కూడా పాల్పడ్డాడు. దీంతో భయపడిపోయిన బాధితురాలు..  తన సోదరుడికి ప్రొఫెసర్ చేస్తున్న ఈ దారుణాన్ని చెప్పుకుంది.

దీంతో కోపోద్రిక్తుడైన ఆమె సోదరుడు కళాశాలకు వచ్చి ప్రొఫెసర్ ను నిలదీశాడు. అయితే, వారు బాధితులపైనే దాడి చేశారు. ఇక చేసేదేమి లేక చివరికి యువతి తన సోదరుడితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం ఈ విషయం బయటకు రావడంతో ప్రొఫెసర్ ను సస్పెండ్ చేయాలని కళాశాలలో నిరసనలు చేపట్టారు.

PREV
click me!

Recommended Stories

అరెస్ట్ అయిన కొన్ని గంటల్లోనే Udayanidhi Stalin విడుదల | Udhayanidhi Stalin Released Within Hours
Udhayanidhi Stalin Speech Controversy: తమిళ రాజకీయాల్లో డబుల్ మీనింగ్ డైలాగ్ ల రచ్చ | Asianet Telugu