సుప్రీంలో శివసేనకు ఎదురు దెబ్బ: ఏక్‌‌నాథ్ షిండే సహా రెబెల్స్ పై ఉద్ధవ్ పిటిషన్ ఈ నెల 11న విచారణ

By narsimha lodeFirst Published Jul 1, 2022, 11:14 AM IST
Highlights

మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే సహా మరో 15 మంది రెబెల్ ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ పై డిప్యూటీ స్పీకర్ నిర్ణయం తీసుకొనే వరకు సస్పెండ్ చేయాలని ఉన్నత న్యాయస్థానంలో శివసేన దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. 


న్యూఢిల్లీ: మహారాష్ట్ర సీఎం Eknath Shinde  సహా మరో 15 మంది Rebel  ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ పై  డిప్యూటీ స్పీకర్ నిర్ణయం తీసుకొనే వరకు సస్పెండ్ చేయాలని ఉన్నత న్యాయస్థానంలో Shiv Sena  దాఖలు చేసిన పిటిషన్ ను అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని Supreme Court  తేల్చి చెప్పింది. అత్యవసరంగా ఈ పిటిషన్ ను విచారించాల్సిన అవసరం లేదని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ నెల 11న రెబెల్స్ దాఖలు చేసిన పిటిషన్ తో కలిపి విచారణ  చేస్తామని ఉన్నత న్యాయస్థానం తెలిపింది. 

 


మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే సహా 15 మంది రెబెల్ ఎమ్మెల్యేలను అసెంబ్లీలో అడుగుపెట్టకుండా సస్పెండ్ చేయాలని సుప్రీంకోర్టులో ఇవాళ శివసేన పిటిషన్ దాఖలు చేసింది.16 మంది శివసేన రెబెల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు  విషయమై డిప్యూటీ స్పీకర్ నోటీసులు జారీ చేశారు. అయితే ఈ విషయమై రెబెల్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ నెల 11 వ తేదీ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అనర్హత నోటీసులపై  రెబెల్ ఎమ్మెల్యేలు సమాధానం ఇచ్చేందుకు గాను ఈ నెల 12 వ తేదీ వరకు సమయం ఇచ్చింది.ఈ తరుణంలో అనర్హత వేటుపై స్పీకర్ నిర్ణయం తీసుకొనేవరకు 16 మంది రెబెల్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది శివసేన. ఈ పిటిషన్ ను అత్యవసరంగా విచారించాలని ఆ పిటిషన్ లో కోరింది. శివసేన తరపున ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ సుప్రీంకోర్టులో వాదించనున్నారు. ఏక్‌నాథ్ షిండే తో పాటు 16 మంది రెబెల్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలోకి అడుగు పెట్టకుండా నిరోధించాలని కూడా ఆ పిటిషన్ లో కోరారు.  

ఫిరాయింపు దారులు ఫిరాయింపు పలాలను అనుభవిస్తున్న సమయంలో డిప్యూటీ స్పీకర్ చేతులు కట్టివేశారని ఆ పిటిషన్ లో శివసేన అభిప్రాయపడింది. ఏక్ నాథ్ షిండే సహా రెబెల్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగు పెట్టకుండా నిషేధించాలని కూడా ఆ పిటిషన్ లో సుప్రీంకోర్టును శివసేన కోరింది. 

పార్టీ వ్యతిరేకంగా వ్యవహరించిన  ఏక్ నాథ్ షిండే కు సీఎం పదవిని కట్టబెట్టిన దుర్మార్గపు చర్యపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని శివసేన ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఏక్ నాథ్ షిండే సీఎ, దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం కావడంతో షిండేతో పాటు ఆయనతో పాటు చేతులు కలిపిన ఎమ్మెల్యేలు మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు  బీజేపీతో చేతులు కలిపినట్టుగా స్పష్టంగా తెలుస్తుందని శివసేన ఆరోపణలు చేస్తుంది. ఈ పిటిషన్ ను అత్యవసరంగా విచారించాలని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 

also read:మహా సీఎం ఏక్‌నాథ్ షిండే, రెబెల్స్ పై సస్పెన్షన్:సుప్రీంలో శివసేన పిటిషన్

ఈ నెల 29న రాత్రి ఏడున్నర  గంటలకు ఏక్‌నాథ్ షిండే సీఎంగా, దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. రేపటి నుండి మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ తరుణంలో సుప్రీంకోర్టులో శివసేన ఈ పిటిషన్ ను దాఖలు చేసింది.
 

click me!