ఇన్విజిలేటర్ తో గొడవ.. పరీక్ష జరుగుతుండగా కత్తితో పొడిచిన విద్యార్థి..

By SumaBala BukkaFirst Published Jan 20, 2023, 7:25 AM IST
Highlights

ఎగ్జామ్ హాల్ లో ఇన్విజిలేటర్ కు విద్యార్థికి తలెత్తిన వివాదంలో.. ఓ టీచర్ తీవ్రంగా కత్తిపోట్లకు గురయ్యాడు. ఈ ఘటన ఢిల్లీలోని ఓ స్కూల్లో జరిగింది. 

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో నానాటికి క్రైమ్ రేట్ పెరిగిపోతుంది. మహిళలపై అత్యాచారాలు, హత్యలతో పాటు.. చిన్న చిన్న విషయాలకే అదుపుతప్పి హత్యలు చేస్తున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. అలాంటి ఓ దారుణ ఘటన తాజాగా ఢిల్లీలో చోటు చేసుకుంది. 12వ తరగతి పరీక్ష రాస్తుండగా ఓ విద్యార్థి ఇన్విజిలేటర్ ను కత్తితో అతి దారుణంగా పొడిచాడు. దీంతో ఆ ప్రభుత్వ ఉపాధ్యాయుడు తీవ్రత గాయాలకు గురయ్యాడు. ఈ షాకింగ్ ఘటన గురువారం మధ్యాహ్నం ఢిల్లీలోని ఇంద్రపురి ప్రాంతంలో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో జరిగింది.

ఈ స్కూల్లో 12వ తరగతి ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతున్నాయి. దీనికి  ఇన్విజిలేటర్ గా గవర్నమెంట్ టీచర్ అయిన భూదేవ్ వచ్చారు. పరీక్ష జరుగుతుండగా  ఓ విద్యార్థి అతనితో వాగ్వాదానికి దిగాడు. అది తీవ్రం కావడంతో ఆ విద్యార్థి కత్తితో పలుమార్లు టీచర్ను పొడిచాడు. ఇది చూసిన తోటి విద్యార్థులు షాక్ అయ్యారు వెంటనే.. మిగతా టీచర్లకు సమాచారాన్ని అందించారు. అక్కడికి చేరుకున్న మిగతా టీచర్లు, స్కూలు  సిబ్బంది తీవ్రంగా గాయపడిన భూదేవ్ ను స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు.

'ప్రజల బాధలు పంచుకోవడానికే వచ్చాను': జమ్మూకాశ్మీర్ లో అడుగుపెట్టిన రాహుల్ యాత్ర..

అక్కడ ఆయనకు డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని సమాచారం. టీచర్ను గాయపరిచిన 12వ తరగతి విద్యార్థిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఆ విద్యార్థిని  జువైనల్ హోమ్ కు తరలించారు. అయితే ఈ ఘటనలో అతను ఒక్కడే కాదని మరో ఇద్దరు విద్యార్థులకు కూడా సంబంధం ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటన నిరుడు సెప్టెంబర్ లో జార్ఖండ్ లో కలకలం రేపింది. తొమ్మిదో తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయ్యామని ఓ టీచర్ ను విద్యార్థులు చితకబాదారు. దీంతో.. ఈ దారుణానికి పాల్పడిన 11 మంది విద్యార్థులు, మరో ఇద్దరు సిబ్బంది మీద ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు పోలీసులు. ఈ ఘటన జార్ఖండ్ దుమ్కా జిల్లా గోపికందర్ పోలీస్స్టేషన్ పరిధిలో గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్ లో జరిగింది. అక్కడ సుమన్ కుమార్ అనే వ్యక్తి మ్యాథ్స్ టీచర్ గా పనిచేస్తున్నాడు. అతని మీదే ఈ దాడి జరిగింది. 

ఈ స్కూల్ విద్యార్థుల ప్రాక్టికల్ మార్కులను ఫైనల్ మార్కుల్లో కలపకపోవడంతో.. వారు టీచర్ మీద ఆగ్రహానికి వచ్చారు. జార్ఖండ్ అకడమిక్ కౌన్సిల్ ( జేఏసీ)  ఇటీవ‌ల విడుదల చేసిన ఫలితాల్లో ఆ స్కూల్లో 32 మంది  9వ తరగతి విద్యార్థుల్లో 11 మంది ఫెయిల్ అయ్యారు. ఆ ఫలితాలు చూసి వారు షాక్ అయ్యారు. మ్యాథ్స్ టీచర్ తమకు ప్రాక్టికల్స్ లో  తక్కువ మార్కులు వేశాడని కోపానికి వచ్చారు. 

దీంతో సుమన్ కుమార్ ఒంటరిగా ఉన్న సమయం చూసి  విద్యార్థులంతా ఒక్కసారిగా దాడి చేశారు. టీచర్ ను చెట్టుకు కట్టేసి విచ‌క్ష‌ణ‌ర‌హితంగా కొట్టారు. ఇది గమనించిన స్కూల్ క్లర్క్ వారిని ఆపడానికి ప్రయత్నించగా.. అతడిని కూడా చెట్టుకు క‌ట్టేసి కొట్టారు. ఈ ఘ‌ట‌న మొత్తాన్ని వారు వీడియో కూడా తీశారు. 

click me!