విద్యార్థి హత్య.. స్కూల్లోనే పాతిపెట్టిన యాజమాన్యం

By ramya NFirst Published Mar 28, 2019, 9:43 AM IST
Highlights

విద్యార్థులకు మధ్య జరిగిన గొడవల్లో.. ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. కాగా..  విషయం తెలుసుకున్న స్కూల్ యాజమాన్యం ఎక్కడ ఈ విషయం పెద్దది అవుతుందోనని భయపడి... విద్యార్థి మృతదేహాన్ని స్కూల్ ఆవరణలోనే పూడ్చిపెట్టారు.

విద్యార్థులకు మధ్య జరిగిన గొడవల్లో.. ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. కాగా..  విషయం తెలుసుకున్న స్కూల్ యాజమాన్యం ఎక్కడ ఈ విషయం పెద్దది అవుతుందోనని భయపడి... విద్యార్థి మృతదేహాన్ని స్కూల్ ఆవరణలోనే పూడ్చిపెట్టారు. ఈ దారుణ సంఘటన డెహ్రాడూన్ లో చోటుచేసుకుంది. కాగా.. ఈ విషయం ఒకరోజు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పూర్తి వివరాల్లోకి వెళితే... వాసుయాదవ్ అనే 12ఏళ్ల విద్యార్థి డెహ్రాడూన్ లోని  ఓ బోర్డింగ్ స్కూల్ లో చదువుతున్నాడు. కాగా.. తన సీనియర్స్ తో జరిగిన గొడవ పెద్దదిగా మారడంతో.. వాసుని సీనియర్స్ క్రికెట్ బ్యాట్స్ తో కొట్టి చంపేశారు. విషయం తెలుసుకున్న స్కూల్ యాజమాన్యం వెంటనే బాలుడిని  వైద్యులకు చూపించారు.

అయితే.. బాలుడు అప్పటికే చనిపోయాడని వైద్యులు తేల్చి చెప్పారు. దీంతో.. వెంటనే బాలుడి మృతదేహాన్ని స్కూల్ ఆవరణలో పూడ్చి పెట్టారు. కేవలం బిస్కెట్ ప్యాకెట్ దొంగతనం చేశాడనే అనుమానంతో.. ఆ బాలుడిని సీనియర్ విద్యార్థులు దారుణంగా కొట్టడం గమనార్హం.

కాగా.. బాలుడిపై దాడి మధ్యాహ్నం జరగగా.. సాయంత్రం వరకు ఆస్పత్రికి తీసుకువెళ్లలేదని.. ఆలస్యం కారణంగానే బాలుడు ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు చెబుతున్నారు. కనీసం బాలుడి పేరెంట్స్ కి కూడా ఈ విషయం స్కూల్ యాజమాన్యం తెలియజేయకపోవడం గమనార్హం. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

click me!