అంతరిక్షరంగంలో సత్తా చాటిన భారత్: మోడీ

Published : Mar 27, 2019, 12:45 PM IST
అంతరిక్షరంగంలో సత్తా చాటిన భారత్: మోడీ

సారాంశం

అంతరిక్ష రంగంలో భారత్ తన సత్తాను చాటిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. 

న్యూఢిల్లీ:అంతరిక్ష రంగంలో భారత్ తన సత్తాను చాటిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. 

బుధవారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి  మాట్లాడారు. మిషన్ స్పేస్ సూపర్ లీగ్‌లో ఇండియా గొప్ప విజయాలను సాధిస్తోందన్నారు. ప్రపంచంలో స్పేస్ పవర్‌లో భారత్ నాలుగో స్థానంలో నిలిచిందన్నారు. భారత శాస్త్రవేత్తలు అంతరిక్షంలో ఎల్ఈఓ  శాటిలైట్‌ను కూల్చేశారని ఆయన చెప్పారు. 

మిషన్ శక్తి ఆపరేషన్‌ పూర్తైందని  మోడీ ప్రకటించారు. మిషన్ శక్తి అనేది అత్యంత కఠినతరమైందన్నారు.  తమ ఆపరేషన్  ఏ దేశానికి కూడ వ్యతిరేకమైంది కాదని మోడీ అభిప్రాయపడ్డారు.

అమెరికా, చైనా, రష్యా తర్వాత స్పేస్‌ రంగంలో భారత్ నిలిచిందని మోడీ  తేల్చి చెప్పారు. అంతరిక్ష రంగంలో భారత్ తన పవర్‌ను సత్తా చాటిందని ఆయన తెలిపారు. 
 

PREV
click me!

Recommended Stories

PM Narendra Modi Visits Somnath Temple: సోమనాథేశ్వర ఆలయాన్ని దర్శించుకున్న మోదీ | Asianet Telugu
Richest Village: 17 బ్యాంకులు, రూ. 7 వేల కోట్లు ఎఫ్‌డీలు.. ఆసియాలోనే ధ‌నిక గ్రామం మాధాప‌ర్ విశేషాలు